విశాఖపట్నం

జామా మసీద్‌లో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: నగరంలో గాజువాక ప్రాంతంలో ఉన్న సున్నిజామా మసీద్‌లో 35ఏళ్ళుగా అవకతవకలు జరుగుతన్నాయని న్యాయవాది అబ్దుల్ షలీమ్ తెలిపారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ముస్లీం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజువాక మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం తామంతా పోరాటం చేస్తున్నామన్నారు. గత 35 ఏళ్ళుగా జామా మసీద్ అధ్యక్షునిగా అబ్దుల్ అజీమ్ కొనసాగుతూ అనేక ఆర్ధికపరమైన అవతవకలతోపాటు ఇతర ముస్లీంలపై వివక్షత చూపుతున్నారన్నారు. 2004లో మసీద్‌తోపాటు దర్గా, స్మశానం అన్నింటికీ అబ్ధుల్ అజీమ్, మాజీ కార్పోరేటర్ తదితరులు కలసి కమిటీగా నియమించుకుని గాజువాక ముస్లీంను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయంపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించిన ఆమజీ సైనికుడు అబ్దుల్ ఖాదర్ భాషాపై దాడి చేసి గాయపరిచారన్నారు. ఆర్టీఐలో వారి చేసిన అవకతవకలు అన్ని బయటపడ్డాయన్నారు. దీనిపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

క్రీడలు ఆరోగ్యదాయకం
* జీవీఎంసీ అదనపు కమిషనర్ జీవీవీఎస్ మూర్తి * మూడవ రోజుకు చేరుకున్న జర్నలిస్టుల క్రీడలు
విశాఖపట్నం, డిసెంబర్ 12: వైజాగ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో అక్కయపాలెం పోర్టు కళావాణిలో జరుగుతున్న సీఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ వేడుకలు మంగళవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు చదరంగం, బ్యాట్మింటన్ క్రీడలు నిర్వహించారు. వీటిని జీవీఎంసీ అదనపు కమిషనర్ జనరల్ జీవివిఎస్‌ఎన్ మూర్తి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికవత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. నిరంతరం సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్న జర్నలిస్టులు ఆడవిడుపుగా ప్రతి ఏడాది నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. వీజేఎఫ్ ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి జరపుతున్నారన్నారు. ఈ సందర్భంగా మూర్తిని ఘనంగా సత్కరించారు. సెట్ల్ సింగిల్స్‌లో రవికుమార్ విజేతగా నిలువుగా రన్నర్‌గా ప్రజాశక్తి గిరి రన్నర్‌గా, మూడవ స్థానం మీడియా విజన్ శంకర్ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్, పిఎన్ మూర్తి, దాడి రవికుమార్, నానాజీ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.