విశాఖపట్నం

అంతర్జాతీయ వాణిజ్యంలో గీతం అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (జీఎస్‌ఐబీ)లో 2017-18 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏలో ఇంటర్నేషనల్ బిజినెస్, గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ , ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్పెషలైజేషన్‌లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు జీఎస్‌ఐబీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేకే నారాయణన్ తెలిపారు. వీటితో పాటు అపార ఉపాధి అవకాశాలున్న బిజినెస్ అనలటిక్స్‌లో ప్రఖ్యాత ఐటీ సంస్థ ఐబీఎంతో కలిసి పీజీ డిప్లొమో కోర్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందగోరేవారు ఏదైనా డిగ్రీలో ద్వితీయ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. బిజినెస్ అనలటిక్స్ పీజీ డిప్లొమో కోర్సులో ప్రవేశం పొందగోరే వారికి రాత పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. రాత పరీక్ష అనంతరం గ్రూప్ డిస్కషన్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుందని, పై అర్హతలతో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు క్యాట్, మ్యాట్, జీమాట్, సీమాట్, ఎక్స్‌ఎటీలలో మంచి ర్యాంకు సాధించిన వారికి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ కోర్సును అభ్యసించే విద్యార్థులను గ్లోబల్ మేనేజర్‌లుగా తీర్చిదిద్దడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రముఖ కంపెనీలలో జీఎస్‌ఐబీ విద్యార్థులకు అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. అమెరికాలోని వర్జీనియా ఐ ల్యాండ్స్ విశ్వవిద్యాలయంతో పాటు చికాగోలోని నార్తన్ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం, దక్షిణాఫ్రికాలోని రీజెంట్ బిజినెస్ స్కూల్‌తో బోధన, పరిశోధనకు అనువైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు రెన్‌బి సొల్యూషన్స్ సంస్థతో కలిసి జీఎస్‌ఐబీ-రెన్‌బి ఇంక్యుబేటర్‌ను గీతంలో ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాలకు గీతం వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

ఈ ప్రగతి తప్పనిసరి
* వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం
విశాఖపట్నం, డిసెంబర్ 12: వచ్చే మూడు నెలల కాలంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ-ప్రగతి తప్పనిసరిగా అమలు చేయలాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ మారుతున్న టెక్మాలజీకి అనుగుణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ప్రగతి ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలతో వృద్ధి రేటు సాధించగలుగుతున్నామన్నారు. అధికారులు సమర్ధవంతంగానే పనిచేస్తున్నప్పటికీ నిర్ధేశించిన లక్ష్యాలు సాధించడంలో మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన అగ్రిటెక్ సదస్సులో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను చూసి అభినందించారని, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలు స్వచ్ఛంధ సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. అదేవిధంగా రియల్‌టైం గవర్నెన్స్ పక్కాగా అమలు చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టిన అనంతరం సరైన ఫలితాలు సాధించినప్పుడే విజయవంతమైనట్టు భావించాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పెద్ద ఎత్తున సాధించాలన్నదే లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో పర్‌కేపిటాలో వెనుకబడి ఉందని, దీనికోసం సుస్థిరాభివృద్ధికి లక్ష్యాలను నిర్ధేశించామన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలన్నారు. నారు నెలల్లో 11.37 శాతం వృద్ధిరేటు సాధించగలిగామన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యానవన, పరిశ్రమలు, పర్యాటక రంగాల ద్వారా ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యశాఖ పరిధిలోని ఆక్వా సాగులో 30 నుంచి 40 శాతం వృద్ధి చోటుచేసుకుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి పాల్గొన్న పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వివరించారు.