విశాఖపట్నం

బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ వైసీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీలు సోమవారం చేసిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌ను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తెల్లవారుజాము నుంచే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు డీపోల వద్ద కూర్చుని బస్సులను బయటకు రానీయకుండా చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత బస్సులు పాక్షికంగా తిరిగాయి. నగరంలోని దుకాణాలను చాలా వరకూ స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని చోట్ల తెరిచిన దుకాణాలను ఆందోళనకారులు మూసివేయించారు. సెంట్రల్ సిటీలో బ్యాంకులు పాక్షికంగా పనిచేశాయి. విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. కార్యాలయాలు పాక్షికంగా పనిచేశాయి. రోడ్లపై తిరుతున్న ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు నిలిపివేశారు. ఆటోలు మాత్రం పూర్తి స్థాయిలో తిరిగాయి. అత్యవసర సర్వీసులకు ఆందోళనకారులు ఆటంకం కలిగించలేదు.
ఇదిలా ఉండగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని పార్టీ నాయకులు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, వంశీకృష్ణ, కోలాగురువులు, అమర్‌నాథ్, కొయ్య ప్రసాదరెడ్డి, జాన్ వెస్లీ గరికిన గౌరి, పసుపులేటి ఉషాకిరణ్ తదితరులు స్థానిక జగదాంబ, మద్దిపాలెం సెంటర్లలో ధర్నా చేశారు. అలాగే, వైసీపీ కార్యకర్తలు హనుమంతవాక, సిరిపురం, జగదాంబ, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి తదితర కూడళ్ల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ హోదా విషయంలో చంద్రబాబు నాయుడు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ ఏవిధంగా దీక్ష చేస్తారని ప్రశ్నించిన చంద్రబాబు దీక్ష ఎలా చేస్తారని ప్రశ్నించారు. హోదా కోసం జగన్ ఒక్కరే ఆది నుంచి పోరాడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించిన ఘనత జగన్‌కు దక్కుతుందని అన్నారు. చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ ప్రజలకు సంజాయిషీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు కూడా రోడ్ల మీద తిరుగుతూ బంద్ చేయించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ఐదు కోట్ల ఆంధ్రులను బీజేపీ వంచించిందని అన్నారు. బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని ఎప్పటికప్పుడు తమ పార్టీ బయటపెడుతున్నా, ఆయన తమ మాట పెడచెవిన పెట్టి, మోదీని నమ్మారని, తద్వారా ఏపీ ప్రజలు అన్యాయమైపోయారని అన్నారు. ఈ బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్రానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని అన్నారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన రైల్వే జోన్‌ను తీసుకురావడంలో ఎంపీ కంభంపాటి హరిబాబు విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శిరి పైడిరాజు, సిపిఐ జిల్లా,నగర కార్యవర్గ సభ్యులు విమల, మార్కండేయులు, ఎండీ బేగం, పీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఎం నాయకులు గంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలకు కాలం చెల్లిందని అన్నారు. హోదా పేరుతో రాష్ట్ర ప్రజలను ఈరెండు పార్టీలూ మోసం చేశాయని అన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యయని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్లలో నాలుగు రకాల మాట్లాడి సమయాన్న వృధా చేశారని అన్నారు. జనసేన ఉత్తరాంధ్ర జిల్లాల అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఒక్కటే ప్రజలను సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారని అన్నారు. జనసేన కార్యకర్తల మద్దిలపాలెం వద్ద రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన తెలియచేశారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, వైసీపీ నాయకులు కొన్ని చోట్ల ర్యాలీలు నిర్వహించారు. మద్దిలపాలెం సెంటర్ ఖాళీ అయిపోవడంతో పిల్లలు రోడ్డుపైనే క్రికెట్ ఆడుకున్నారు.