విశాఖపట్నం

ప్రభుత్వాలు మారినా కార్మికుడి తలరాత మారట్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 1: ప్రభుత్వాలు మారినా కార్మికుడి తలరాత మారట్లేదని సీపీఐ కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశ సంపదలో 73 శాతం ఒక్క శాతం ఉన్న సంపన్న వర్గాల చేతుల్లోనే ఉందన్నారు. మిగిలిన 99 శాతం మంది ప్రజానీకం 27 శాతం సంపదతో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారన్నారు. దోచుకునే వాడు దోచుకుంటూ మరింత ధన వంతుడవుతుంటే, నిరుపేద దోపిడీకి గురై అణగారిపోతున్నాడన్నారు. దోపిడీ, అసమానతలు లేని సమాజ స్థాపన జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ సంపదలో నిరుపేదల వాటా వారికి దక్కాలని అందుకు కార్మికుల చేతికి అధికారం రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూనే ఉందన్నారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయిస్తూ కార్మికులను రోడ్డున పడేస్తోందన్నారు. లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ద్వారా దోపిడీకి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే క్రమంలో ఎన్‌డీఏ సర్కారు ముందు వరుసలో ఉందన్నారు.

ఒక పూట దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు
ప్రత్యేక హోదా చంద్రబాబు ఒక పూట దీక్ష చేస్తే ప్రభుత్వ ఖజానాకు రూ.30 కోట్లు ఖర్చవుతోందని రామకృష్ణ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను నాలుగేళ్ల పాటు పాతరేసిన చంద్రబాబు ఇప్పుడు హోదా అంటూ దీక్షలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోరుతూ తాము ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టించి, అరెస్టులు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే హోదా అంశాన్ని ఎందుకు అందిపుచ్చుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం తన రాజకీయ లబ్ధికోసమే ప్రత్యేక హోదాను వాడుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు ప్యాకేజీతో మరింత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తున్నారన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. సమావేశంలో సీపీఐ సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, సీపీఐ నాయకులు వీవీ రామారావు, ఆదినారాయణ, పడార రమణ, బీసీహెచ్ మసేన్, తదితరులు పాల్గొన్నారు.