విశాఖపట్నం

నేటి నుంచి విశాఖ-జగ్దల్‌పూర్‌కు విమాన సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: సామాన్యులకు సైతం విమాన సేవలను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పేరుతో విమాన సర్వీసుల సంఖ్యను గణనీయంగా పెంచింది. ఇందులో భాగంగా విశాఖ నుంచి ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్‌కు విమాన సర్వీసును బుధవార నుంచి ప్రారంభించబోతోంది. 18 సీట్లు కలిగిన బీచ్ క్రాఫ్ట్ 1900డి విమానాన్ని ఈ సేవలకు వినియోగిస్తున్నారు. ఈ విమానం ప్రతి రోజు ఉదయం 9.35 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 10.05లకు తిరిగి బయల్దేరుతుంది. 10.50 గంటలకు జగ్దల్‌పూర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి రాయపూర్, భువనేశ్వర్‌కు చేరుకుంది. మర్నాడు ఉదయం భువనేశ్వర్ నుంచి రాయపూర్, జగ్దల్‌పూర్ మీదుగా విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి జగ్దల్‌పూర్‌కు విమాన చార్జి 2000 నుంచి 2500 రూపాయల మధ్య ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్ నాయకులు ఓ.నరేష్‌కుమార్ తెలియచేశారు.

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి
విశాఖపట్నం, జూన్ 19: రాష్ట్రంలో సామాజికంగా వెనకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని మంగళవారం నగరంలో జరిగిన బీసీ ఐక్య సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దువ్వారపు రామారావు డిమాండ్ చేశారు. 2019లో రాజకీయపరంగా బీసీలు ఎదగాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడలో జరిగిన తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు విశాఖలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. గత నాలుగు రోజులుగా ప్రధాన దేవాలయాల్లో నారుూ బ్రాహ్మణులు చేస్తున్న ఆందోళనకు తాము అండగా నిలబడతామని చెప్పారు.