విశాఖపట్నం

మృతి చెందిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 17: సుగర్ ఫ్యాక్టరీకి మంజూరైన నిధుల్లో ముందుగా కార్మికుల బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించి మృతి చెందిన కార్మికుల కుటుంబాలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన నియోజకవర్గ నాయుకులు కొణతాల సీతారామ్ డిమాండ్ చేసారు. స్థానిక జనసేన పార్టీకార్యాలయంలో సోమవారం 70మంది యువకులు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి సీతారామ్ పార్టీ కండువావేసి ఆహ్వనించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధుల్లో కార్మికులకు పూర్తిస్థాయిలోబకాయిలు చెల్లించి వారికి న్యాయం చేయాలన్నారు. ఆరుగురు రాష్ట్ర మంత్రులను ఫ్యాక్టరీకి తీసుకొస్తానని చెబుతున్న ఎమ్మెల్యే పీలా వారి సమక్షంలోనే కార్మికులకు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. అలాగే వారికుంటుబ సభ్యులకు ఒకరికి ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పించాలన్నారు. జనసేన పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై యువత పార్టీలో చేరుతున్నారని వచ్చే ఎన్నికల్లో దిగువ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో వాకాడ మదన్, సురభి, హరీష్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.