విశాఖపట్నం

భూగర్భ విద్యుద్ధీకరణ ప్రాజెక్టుకు కొర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: భూగర్భ విద్యుద్ధీకరణ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టేశారు. దీనికి రూ.720 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రపంచబ్యాంకు వీటిని కేటాయించేసింది. త్వరలో తొలిదశ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధంమైంది. వినియోగదారులు, నగర ప్రజల్లో ఉండే అపోహలు, సందేహాలు తొలగించేందుకు సైతం అనేకసార్లు సదస్సులు నిర్వహించేశారు. తొలివిడత నిర్మాణ పనులకు విద్యుత్‌శాఖ ముహు ర్తం పెట్టనుంది. నిర్మాణ పనులు ప్రారంభం నుంచి కేవలం ఏడాదిన్నర కాలం వ్యవధిలో యుద్ధప్రాదిపదికన పూర్తిచేయాలని కూడా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిసిఎల్) లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు దశల్లో 2018 చివరి నాటికి పూర్తిచేయాలని నిర్దేశించుకున్న భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్టును నగరంలోని ముఖ్యమైన 22 సబ్‌స్టేషన్ల పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. ఇది పూర్తయితే ఎంతటి విపత్తులనైనా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తవు. పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతోంది. ప్రతి ఏడాది ప్రీ మాన్సూన్ కార్యకలాపాలు నిర్వహించాల్సిన పని ఉండదు. దీనివల్ల సంస్థకు ఆర్ధిక భారం తప్పుతుంది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో జిల్లాయంత్రాంగం జోక్యంతో తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. భూగర్భ విద్యుద్ధీకరణకు ఉపయోగించే ఫైబర్ బాక్స్‌ల్లోనే జివిఎంసికి చెందిన వాటర్ పైపులైన్లను ఏర్పాటు చేసుకుంటే ఒకేసారి రెండు కార్యక్రమాలు పూర్తిచేసినట్టు అవుతుందని, దీనివల్ల ఖర్చు తగ్గుతుందనే జిల్లా యంత్రాంగం అభిప్రాయంతో ఈ ప్రాజెక్టు కాస్త వెనక్కి పోయింది. వాటర్ పైపులైన్ల లీకేజీలు సమస్యగా మారనున్నాయి. జివిఎంసి వాటర్ పైపులైన్ల ఏర్పాటు మాట ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రపంచబ్యాంకు ఈ ప్రాజెక్టుకే మంజూరు చేసిన రూ.720 నిధుల మాటేమిటంటూ ఈపిడిసిఎల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి వచ్చేనెల 15వ తేదీన తొలివిడత టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం ఈ ప్రాజెక్టు నిర్వహణ, నిధులు మంజూరు తదితర అంశాలను పరిశీలించేందుకు ఈ నెల 23వ తేదీన ఇక్కడకు రానుంది. అన్నివిధాలా సిద్ధపడిన తరుణంలో ఇటువంటి అంతరాయాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖలో ఏర్పడిన హుదూద్ తుపానుతో అప్రమత్తమైన తాము ఇటువంటి విపత్తుల నుంచి బయటపడేందుకు బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే ఈ భూగర్భ విద్యుద్ధీకరణ ప్రాజెక్టు కోసం గత ఏడాదిన్నర కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని అధికారి ఒకరు పేర్కొన్నారు.