విశాఖపట్నం

జగన్ దీక్షకు వైఎస్‌ఆర్‌సిపి నేతల సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షక మద్దతుగా నగరంలోని పార్టీ నాయకులు తహశీల్దార్ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా శిబిరాలు నిర్వహించారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ ధర్నాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జి తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చేపట్టిన నాటి నుంచి రాష్ట్రానికి అన్ని విషయాల్లోను తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదా వంటి విషయాలపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. వీటిపై చంద్రబాబు కేంద్రంపై వత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. చివరకు నీటికోసం కూడా ఏపీ ప్రజలు అల్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు కడుతున్నా కనీసం సిఎం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొయ్యా ప్రసాదరెడ్డి, పక్కి దివాకర్, బర్కత్ ఆలీ, కంపా హనూక్, సత్తి రామకృష్ణారెడ్డి, సనపల చంద్రవౌళి, పసుపులేటి ఉషాకిరణ్, జీవీ రమణి, పైడి రత్నాకర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
* రూరల్ కార్యాలయం వద్ద...
జగన్ దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ తూర్పునియోజకవర్గం ఇన్‌చార్జి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం రూరల్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలంటే ప్రజల తరపున చంద్రబాబు కేంద్రంపై వత్తిడి తీసుకురావాల్సిందేనన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని లెక్కగడితే చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉన్నదనేది స్పష్టమవుతుందన్నారు. లోకేష్ రెండేళ్ళ పాలనలో లక్షా ఏభై వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటే ఈ రాష్ట్ర ఏమవుతుందోనన్న భయం ఏర్పడుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆనకట్టల వల్ల ఆంధ్రాలోని ఎనిమిది జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాగునీరు లేని పరిస్థితి ఇప్పటికే చూస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణాలపై ఆనకట్ట వేస్తే పరిస్థితులు అద్దాన్నంగా ఉంటాయన్నారు. దీనిపై తమ పార్టీ అధినేత జగన్ దీనిని అడ్డుకోవడానికి మూడు రోజుల దీక్ష చేపట్టి చంద్రబాబుకు వణుకుపుట్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కార్పొరేట్ పాలన మాని సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా పాలన చేపట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోని శివరామకృష్ణ, పేర్ల విజయచంద్రరావు, పతివాడ కనకరాజు, నారాయణరావు, మహిళా నాయకులు కారి శ్రీలక్ష్మి, ఉమారాణి, కళావతి పాల్గొన్నారు.