విశాఖపట్నం

నిశ్శబ్థంగా విస్తరిస్తున్న షుగర్ వ్యాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న జీవనశైలి, ఆహారపుఅలవాట్లు తదితర కారణంతో చిన్న వయస్సు నుంచి పెద్ద వారి వరకూ అందరిని వేధిస్తున్న వ్యాధి... మధుమేహ (డయాబెటిస్). చిరుప్రాయం నుంచి పిల్లలకు జంక్ పుడ్ అలవాటు చేయడం, ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువ సమయం గడపడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఏడాదికి 40 లక్షల మంది మధుమేహ వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నాయి. మరో పదేళ్లలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు నియంత్రించుకోక పోతే భారత దేశం మధుమేహానికే రాజధానిగా మారనుందని వైద్య వర్గలు చెబుతున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వాటిపై ఈ నెల 14న ప్రపంచ మధుమేహా దినోత్సవం(డయాబెటిస్ డే) సందర్భంగా ప్రత్యేక కథనం....
==========
జగదాంబ,నవంబర్ 13: నిత్యం ఒత్తిడి, జీవన యాంత్రిక విధానంలో ప్రస్తుతం మనిషి ఆరోగ్యంపై శ్రద్ధ, తినే ఆహారంపై సరైన సమయపాలన పాటించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారు. దీనిలో ముఖ్యంగా మధుమేహ వ్యాధి బారిన పడిన వారికి పూర్తి స్థాయిలో అవగాహాన లేక పోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. జిల్లాలో రోజు రోజుకి మధుమేహ బాధితులు సంఖ్య మరింతగా పెరుగుతుంది. వ్యాధిని నియంత్రించడానికై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలల్లో అవగాహన కల్పించడానికి ప్రత్కేక కార్యక్రమాలను చేపడుతుంది. ముఖ్యంగా మధుమేహ బారిన పడుతున్న వారిలో అధికంగా నగర వాసులతో పాటు, యువత కూడా అధికంగా ఉండటం బాధకరమైన విషయం. మానవ శరీరానికి పోషకాలను అందించడానికి సరైన ఆహరానికి బదులుగా పాస్ట్ఫుడ్‌లకు అలవాటు పడటం,కనీస వ్యాయమం కూడా చేసే తీరిక లేక పని ఒత్తిడితో కాలం గడుపుతుండటం, ఊబకాయం బారిన పడుతున్నవారిలో ఈ వ్యాధి అధికంగా నమోదు అవుతుందని వైద్య నిపుణలు పేర్కొంటున్నారు.
* మధుమేహం మూడు రకాలు
మధుమేహం మూడు రకాలు... వీటిని టైప్ 1,2,3గా చెబుతుంటారు. ప్రస్తుత సమాజంలో అధిక శాతం మంది టైప్-2 వ్యాధితోనే బాధపడుతుంటారు. ప్రతీ వంద మందిలో ఆరుగురు మాత్రమే టైప్-1 వ్యాధికి గురైన వారు వుంటారు. వీరందరికి ఎన్ని జాగ్రత్తలు పాటించిన జన్యుపరంగా ఈ వ్యాధి వస్తుంది. అంతేకాకుండా వంశపర్యపరం, పుట్టికలో తేడా, చిన్న వయస్సు నుంచి ఇన్సులిన్ గ్రంధి లోపం తదితర కారణాల నేపధ్యంలో కూడా మధుమేహాం బారిన పడే అవకాశాలున్నాయి. అదే విధంగా టైప్-3 మధుమేహం ఎక్కువుగా గర్భం దాల్చిన వారిలో కనిపిస్తుంది. ప్రసవం తరువాత మళ్లీ సాధారణ స్థితికే వస్తుంది. మధుమేహా వ్యాధిగ్రస్తులల్లో 90 శాతం మంది టైప్-2 రకానికి చెందిన వారే. ఈ వ్యాధి సాధారణంగా 35 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో కనిపిస్తుంది. వీరు ఆహారపు అలవాట్లు నియంత్రణ పాటించడం ద్వారా కోంత మేర ఫలితం వుండవచ్చు.
* వ్యాధి లక్షణాలు ఇవే...
మధుమేహ బారిన పడే రోగులల్లో సగానికి పైగా వ్యాధిగ్రస్తులు అధిక బరువు పెరగడం లేక తగ్గడం, ఎప్పుడూ నీరసం, ఎక్కువ సార్లు ముత్ర విసర్జనకు వెళ్లడం, మధుమేహ పర్సంటేజిలో తేడా ఉంటే శరీరంలో వణుకు రావడం, కాళ్లు, చేతుతు తిమ్మిర్లు, పాదాల్లో స్పర్శ తగ్గిపోవడం, గ్లూకోమా కారణంగా కంటి చూపు తగ్గే ప్రమాదం వుంది. మధుమేహాం కారణంగా గుండె సంబంధింత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
* నివారణా మార్గాలు ఇవే..
మధుమేహా వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
* ఒత్తిడి తక్కువుగా వుండే జీవన శైలిని ఆలవాటు చేసుకోవడం
* స్థిరమైన సమయాల్లో ప్రతీరోజూ ఓకే మొత్తంలో భోజనం చేయడం, రోజు ఒక గంట పాటు వ్యాయమం చేయాలి
* ఎత్తుకు తగ్గిన బరువు వుండేలా చూడటంతో పాటు, 35 ఏళ్లు దాటిన వారు తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించడం
* ఉప్పును పరిమితంగా తీసుకోవడం...శాఖాహరానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, గాయాలు తగలకుండా చూడటం, క్రమబద్ధంగా మధుమేహా పరీక్షలు చేయించకోవడం ద్వారా నివారించగలమని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహా వ్యాధిగ్రస్తులు తాము తీసుకునే ఆహారంలోతప్పనిసరిగా కాయగూరలు, ఏదో ఒక్క పండు వుండేలా చూసుకోవాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్‌కు దూరంగా వుండటం ఏంతో శ్రేయస్కరమని వైద్యులు పేర్కోంటున్నారు.
* మధుమేహా వ్యాధిపట్ల అప్రమత్తంగా వుండాలి
మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. గతంలో మాదిరిగా కాకుండా చిన్నపిల్లలో కూడా ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత పెరిగిపోయింది. మధుమేహం అదుపులో వుంటే దాని వల్ల వచ్చే గుండె, కీడ్ని, నరాలు, కంటె రేటీనా జబ్బులు, పక్షవాతం, కాలికి మానని గాయాలను నివారించవచ్చు. గర్భిణిలు మరింత అప్రమత్తంగా వుండాలి. జీవన విధానంలో వచ్చిన మార్పులే అనేక రోగాలకు కారణమవుతున్నాయి. మధుమేహం కూడా అదే కోవకు చెందుతుంది. వ్యాయమం, డైట్, ఇన్సులిన్ సమపాళ్లలో వుండేలా చూసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టైప్-2 మధుమేహన్ని దూరంగా వుండే అవకాశం వుంది. తల్లిదండ్రలు పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా వుండాలి, ఇష్టమైన ఆహరాన్ని అందిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు.