విశాఖపట్నం

ముస్లింల సమస్యల పరిష్కారంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 13: ముస్లిం,మైనార్టీల సమస్యల పరిష్కారానికి సంబంధిత వర్గాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ముస్లిం ప్రతినిధులతో స్థానిక సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్ నేతృత్వంలో ముస్లిం ప్రతినిధులు మంత్రిని కలిసి వక్ఫ్ బోర్డు స్థలాలు, ముస్లిం వర్గాలకు ఇళ్ల స్థలాల మంజూరు, శ్మశాన వాటికలు, మసీదు స్థలాల ఆక్రమణలు, షాదీఖానా, మసీదుల ఆధునీకరణ, ఉర్ధూ టీచర్ పోస్టుల భర్తీ వంటి అంశాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగానే మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా మంత్రి పోస్టును అదే వర్గానికి చెందిన సీనియర్ నాయకునితో భర్తీ చేసిందన్నారు. ముస్లిం ప్రతినిధులు తన దృష్టికి తెచ్చిన సమస్యలన్నింటినీ క్రోఢీకరించి సమగ్ర నివేదిక రూపొందించి, మైనార్టీ సంక్షేమ మంత్రి ఫరూక్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించనున్నట్టు వెల్లడించారు. ముస్లిం ప్రతినిధులు పేర్కొన్న సమస్యలన్నింటినీ నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరిస్తామన్నారు. ఇదే సందర్భంలో మంత్రి గంటా మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ముస్లిం సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసే సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ముస్లింలకు ఉపయోగకరంగా ఉండేలా అత్యాధునిక కల్చరల్ సెంటర్‌ను విశాఖలో నిర్మించాలని, అందుకు అవసరమై స్థలాన్ని కేటాయించాలని మంత్రి గంటా దృష్టికి తీసుకురాగా అందుకు సమ్మతించారు.

సభ్యత్వ నమోదులో మొదటి స్థానం రావాలి
* ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖపట్నం, నవంబర్ 13: సభ్యత్వ నమోదులో విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే, టీడీపీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది సభ్యత్వ నమోదులో దక్షిణ నియోజకవర్గం అగ్రస్థానం సాధించిందని, వచ్చే రెండేళ్లకు గాను జరుగుతున్న సభ్యత్వ నమోదులో కూడా అదే తీరు కొనసాగించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం 56,537 సభ్యత్వాలు లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఆదేశించిందని, లక్ష్యాన్ని అధిగమించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లకు జిల్లా నాయకులను సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జిలుగా నియమించామన్నారు. ఈ కమిటీ ప్రతి సోమవారం సమావేశమై సభ్యత్వ నమోదు నివేదికను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలన్నారు. డివిజన్‌లో సభ్యత్వాల నమోదు చురుకుగా జరిగేందుకు అవసరమైన చర్యలు ఇన్‌ఛార్జిలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారిని పార్టీ పట్ల ఆకర్షించాలన్నారు. బూత్ కమిటీ సభ్యులైన సేవామిత్రలకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తున్నామని, సేవా మిత్రలు హాజరయ్యేలా చూడాలని డివిజన్ కమిటీ కార్యవర్గాన్ని ఆదేశించారు. సమావేశంలో డబ్ల్యు భాస్కరరావు, రామానంద్, మైలపల్లి శ్రీను, పీవీ రమణ, జఫరుల్లా, ఎస్‌ఎ చినరెహ్మాన్, కేదార లక్ష్మి, వీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మార్చి లోగా 1000 అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలి
* ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై కలెక్టర్ సమీక్ష

విశాఖపట్నం, నవంబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో జిల్లాలో 1000 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధిహామీ కన్వర్జెన్స్‌పై పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకూ కేవలం 50 భవనాలు మాత్రమే పూర్తయ్యాయని, మరో 25 భవనాలు నెలాఖరుకు పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. 468 భవనాల పనులు పురోగతిలో ఉండగా, త్వరలోనే మరో 150 భవనాల నిర్మాణ పనులు మొదలుకానున్నాయన్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి ఐఎంఆర్, ఎంఎంఆర్ రేటు తగ్గించేందుకు అంగన్‌వాడీలు కృషి చేయాలన్నారు. అంగన్ వాడీలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇదే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతాంశంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 600 అంగన్‌వాడీ భవనాల్లో మరుగుదొడ్లు లేనిచోట నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని, కొత్తగా నిర్మించే వాటిని అన్ని వసతులతో కూడినవిగా చూస్తామన్నారు. భవనాల నిర్మాణానికి అనుమతి రాగా 172 చోట్ల స్థల సమస్యలు ఎదురయ్యాయని, వీటిలో 32 ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించామన్నారు. మరో 140 భవనాల నిర్మాణానికి ఐసీడీఎస్ అధికారులు చొరవ తీసుకుని స్థానిక తహశీల్దారు, ఎంపీడీఓలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలో అత్యంత మారుమూల రహదారి సదుపాయం లేని చోట స్థానికంగా లభించే సామాగ్రిని ఉపయోగించి భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. లక్ష్యాల పురోగతిపై ప్రతి వారం సమీక్షిస్తానని స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 140 పంచాయతీ భవనాలు, 119 శ్మశానవాటికల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. పశుసంవర్ధక శాఖ జిల్లాలో 1000 మినీ గోకులాలు నిర్మించాల్సి ఉందని, ఇప్పటి వరకూ కేవలం 150 పనులు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. గృహనిర్మాణ శాఖ యూడీఏ పరిధిలోఅనకాపల్లి, పెందుర్తి, భీమిలి, పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో 38వేల ఇళ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సృజన, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వేణుగోపాల్, హౌసింగ్, డ్వామా పీడీలు ప్రసాద్, దయానిధి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఏయూలో పుస్తక ప్రదర్శన
* ఈనెల 20వరకూ నిర్వహణ

విశాఖపట్నం, నవంబర్ 13: ఆంధ్రా యూనివర్శిటీలో పుస్తక భాండాగారంలో విలువైన పుస్తకాలను ప్రజలు, విద్యార్థులు, మేథావుల సందర్శనార్ధం ఈనెల 14 నుంచి 20 వరకూ డాక్టర్ వీఎస్ కృష్ణ లైబ్రరీ వేదికగా పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. దేశంలోనే ఎంతో ప్రాచుర్యం కలిగిన డాక్టర వీఎస్ కృష్ణా లైబ్రరీ వర్శిటీ ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి 1927లో స్థాపించారు. ప్రస్తుతం గ్రంధాలయంలో అరుదైన, అతిప్రాచీన తాళపత్ర గ్రంధాలు, డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులైన నెహ్రూ, అంబేద్కర్ తదితరుల సంతకాలతో కూడిన భారత రాజ్యాంగ ఒరిజినల్ ప్రతితో పాటు దేశంలోనే అరుదైన గ్రంధాలు సందర్శనార్ధం అందుబాటులో ఉంచనున్నారు. ఈ లైబ్రరీ 60వేల చదరపుఅడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 16,614 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రీడింగ్ రూంతో పాటు లైబ్రరీలో 5,23,555 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అత్యంత విలువైన 2075 తాళపత్ర గ్రంధాలు 8,679 ఈ జర్నల్స్ ఉన్నాయి. తాళపత్ర గ్రంధాల్లో 1220 సంస్కృత భాషలోను, మరో 12 ప్రాకృత భాషలోను, 12 పాళీ భాషలోను, 447 తెలుగు భాషలోను, 13 తాళపత్ర గ్రంధాలు బెంగాళీ భాషలోను ఉన్నాయి. నిత్యం సుమారు 900 మంది సందర్శకులు ఈ గ్రంధాలయంలో పుస్తకాలు చదువుతుంటారు. గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా వీటిని సందర్శనకు ఉంచుతున్నట్టు చీఫ్ లైబ్రేరియన్ ఆచార్య కే విశే్వశ్వర రావు తెలిపారు. ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకూ పాఠకులు, సందర్శకుల కోసం వీటిని తెరచి ఉంచుతున్నట్టు తెలిపారు.
భావాలకు భాష వారధి
*ఏయూ వీసీ నాగేశ్వర రావు

విశాఖపట్నం, నవంబర్ 13: భావాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు భాష వారధిగా పనిచేస్తుందని ఏయూ వీసీ ఆచార్య జీ నాగేశ్వర రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహిస్తున్న ఇంటర్ డిసిప్లినరీ రిఫ్రెషనరీ కోర్సు ఇండియన్ లాంగ్వేజీ అండ్ లిటరేచర్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతిలో వెనుకబడిన విద్యార్థికి సైతం అర్ధమయ్యే విధంగా విద్యాబోధన జరగాలన్నారు. భారతీయ భాషా సాహిత్యం ఎంతో విశిష్టమైందన్నారు. కేంద్ర సంచాలకులు ఆచార్య పీ విశ్వనాధం మాట్లాడుతూ తమ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న 370 కార్యక్రమంగా పేర్కొన్నారు. అనేక సమస్యలకు భాష పరిష్కారాన్ని చూపుతుందన్నారు. శిక్షణ కార్యక్రమం సమన్వయ కర్త ఆచార్య వై ఏడుకొండలు, కేంద్ర ఉపసంచాలకులు ఆచార్య ఎన్‌ఏడీ పాల్ తదితరులు పాల్గొన్నారు.