విశాఖపట్నం

ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులను ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 19: శ్రీకాకుళం జిల్లాను అతాలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు గుంటూరు,ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రజాసంఘాలు బాధితులకు అందించేందుకు బియ్యాన్ని రవాణా చేస్తుంటే పోలీసులు అక్రమంగా వాటిని స్వాధీనపర్చుకోని ప్రజా సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరికాదుని పలు ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో సోమవారం విజె ఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకురాలు కత్తి పద్మ మాట్లాడుతూ ఉద్దాన ప్రాంత ప్రజల జీవనాధారమైన జీడిమామిడి, కొబ్బరి,అరటి తోటలు తీరప్రాంత గిరిజనుల గుడిసెలు పూర్తిగా ధ్వసంమాయ్యాని, మత్య్సకారులు పడవులు విరిగిపోవడంతో వారి బతులకులంతా ఆగమయ్యాంగా మారాయాన్నారు. బాధితులను పూర్తిస్థాయిలోనే ఆదుకుంటామని ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘెరంగా విఫలమైయ్యాయన్నారు. ముఖ్యంగా ఉద్దాన ప్రాంత బాధితులకు తిత్లీ తుఫాన్ బాధితుల కమిటీగా ఏర్పడి 160 గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్ధితులను రికార్డు చేసి కరపత్రం రూపంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చారని, వారి న్యాయమైన నష్టపరిహారాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని ప్రశించాలన్నారు. తిత్లీ తుఫాన్‌ను తక్షణమే జాతీయ విపత్తుగా గుర్తించడంతో పాటు,రూ.1200కోట్ల నిధులను తక్షణ సాయంగా కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అక్రమ ఆరెస్టులకు పాల్పడిన ప్రజాసంఘాల నాయకులను, కార్యకర్తలపై మోపిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు అన్నపూర్ణ, కుల నిర్మూలనా పోరాట సమితి కన్వీనర్ డి. ఆనంద్, అమరవీరుల బందుమృతుల సంఘం నాయకులు లక్ష్మణరావు,ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు మల్లన్న తదితరులు పాల్గొన్నారు.