విశాఖపట్నం

స్వచ్ఛ సర్వేక్షన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: మహా విశాఖ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ -2019లో ఉత్తమ స్థానాన్ని సాధించడానికి నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ లక్ష్మీనారాయణ అన్నారు. జీవీ ఎంసీ పాత సమావేశ మందిరంలో శనివారం స్వచ్చసర్వేక్షన్ నిబంధలను తదితర వాటిపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ స్వచ్చసర్వేక్షన్ నిబంధనల ప్రకారం తడి-పొడి చెత్త సేకరణ, విభజన కంపోస్టింగ్ ఎల్ సోర్స్ ద్వారా స్వచ్చ విశాఖ సాధించాలని హితువు పలికారు. బయోడిగ్రేడుబుల్, నాన్ బయోడిగ్రేడబుల్, రీసైకిల్ ద్వారా ఘన వ్యర్థాలల నిర్వహణ సాధించాలన్నారు. ఎవరు చెత్తను ఉత్పత్తి చేస్తున్నారో ఆయా సంస్థలు, ప్రజలు చెత్త తోలగింపు బాధ్యత వహించాలన్నారు. ప్రతీ రోజు వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, 300 నుంచి 400 మెట్రిక్ టన్నుల తడిచెత్త సేకరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ రూల్స్ అమలవుతున్నప్పటికీ శతశాతం సాధించలేక పోతున్నామని, ప్రజలు ప్రత్యామ్నాయంగా గుడ్డ,పేపర్ కవర్లును వినియోగించుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవీ ఎంసీ అదనపు కమిషనర్ జీవీవీ ఎస్ మూర్తి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ హేమంత్, జోనల్ కమిషనర్లు, వైద్యాధికారులు, పట్టణ ప్రణాళికాధికారులు తదితరులు పాల్గొన్నారు.

21న మున్సిపల్ కార్మికలు చలో విజయవాడ
విశాఖపట్నం, డిసెంబర్ 15: మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి తెలిపారు. శనివారం జగదాంబ సిటూ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు వినతి పత్రం ఇచ్చి సాముహిక రాయభారం నిర్వహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికులు 13రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, అధికారులు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నేరవేరకపోవడంతో కార్మికులంతా తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో మరోసారి సమ్మెకు దిగుతామన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి నూకరాజు, ఉపాధ్యక్షుడు అప్పలరాజు, సహాయ కార్యదర్శి ఈశ్వరరావు, రమణ, నాయడు తదితరులు పాల్గొన్నారు.