విశాఖపట్నం

మరిన్ని ఎన్టీఆర్ వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, జనవరి 2: నిరుపేదలకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవను మరింత పెంచడం జరిగిందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మహావిశాఖ గాజువాక జోనల్ పరిధి 56వ డివిజన్‌కు సమీపంలో గల కన్నూరు గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే బండారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఇప్పటి వరకు 2లక్షల 50వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అయితే ఈ ఏడాది నుండి 5లక్షల రూపాయలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలీ చాలని వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న నిరుపేద రోగులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో దీనిని 5లక్షల రూపాయలను పెంచడం జరిగిందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. ఇది మంచి శుభ పరిణామం అని ఆయన స్పష్టం చేశారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రజలు పూర్తి సహాయ సహకారాలను అందించాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ వర్గాలకు ఆదరణ పథకం ద్వారా యంత్ర సామాగ్రిని అందించి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్స్ ద్వారా ఆ యా వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పరవాడ మండలాధ్యక్షులు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ పయిల జగన్నాధరావు, అటవీ అభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్ మాధంశెట్టి నీలబాబు, అధికారులు బి.విజయప్రసాద్, హేమసుందర్, పోతల సత్యనారాయణ, రంగారావు, టీడీపీ నాయకులు గంట్ల పైడిరాజు, మడక రాజునాయుడు, ఎంపీటీసీ గంట్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి-మాఊరు విజయవంతం చేయాలి
గాజువాక, జనవరి 2: జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం మహావిశాఖ గాజువాక జోనల్ పరిధిలో గల పలు డివిజన్స్‌లో విసృత ప్రచారాన్ని నిర్వహించారు. మహావిశాఖ నగర పాలక సంస్థ అధికారుల సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ డివిజన్స్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దీంట్లో భాగంగా వీధుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. అలాగే కరపత్రాలను పంపిణీ చేశారు. జన్మభూమి-మావూరు కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ సభలను నిర్వహించి జన్మభూమి ముఖ్య ఉద్ధేశాన్ని అధికారులు ప్రజలకు వివరించారు. ప్రధానంగా జివిఎంసి గాజువాక జోనల్ పరిధి 63వ డివిజన్ పరిధిలో తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు గోమావ వాసు ఆధ్వర్యంలో జన్మభూమి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జన్మభూమి ముఖ్య ఉద్ధ్యేశాన్ని వివరించారు. దీంట్లో భాగంగా గురువారం గాజువాక హైస్కూల్‌లో జరిగే జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. అలాగే 55వ డివిజన్ పరిధిలో జన్మభూమి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలు సాధించుకునే ప్రభుత్వ పథకాలు గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలు ఎలా పొందాలన్న విషయాలను నాయకులు ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల అచ్చెల్‌నాయుడు, పాల నగేష్, ముర్తాజ్, కోటి, శ్రీనివాసరావు, చింటు, నర్గీస్, రాబాయి తదితరులు పాల్గొన్నారు.