విశాఖపట్నం

సీఐలకు స్థాన చలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), జనవరి 2: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐదుగురు సిఐలకు స్థానచలనం కలిగిస్తూ సీపీ మహేష్‌చంద్ర లడ్హా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌బీలో ఎటాచ్‌లో ఉన్న సిఐ సిహెచ్ వెంకటనాయుడును పిఎం పాలెం లా అండ్ ఆర్డర్ సిఐగా, సీపీఓ ఎటాచ్‌లో ఉన్న సిఐ ఎల్ భాస్కరరావును న్యూపోర్టు సిఐగా, సీఎస్‌బీలో ఎటాచ్‌లో ఉన్న మరో సిఐ వి బాబ్జీరావును సీసీఎస్‌కు, సీపిఓలో ఎటాచ్‌లో ఉన్న సిఐ పి సూర్యనారాయణను ఆనందపురం సిఐగా, సీఎస్‌బీలో ఎటాచ్‌లో ఉన్న ఇంకో సిఐ పి పైడపునాయుడుని రెండో పట్టణ లా అండ్ ఆర్డర్ సిఐగా బదిలీలు చేశారు.
* రేంజ్ పరిధిలో మరో ఐదుగురు సిఐలకు బదిలీ
విశాఖ రేంజ్ పరిధిలోని మరో ఐదుగురు సిఐలకు బదిలీలు చేస్తూ రేంజ్ డిఐజి సిహెచ్ శ్రీకాంత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేంజ్‌లో విఆర్‌లో ఉన్న సిఐ జె శ్రీనివాసరావును, రుషికొండ సిఎస్‌పిఎస్‌లో ఉన్న సిఐ డీవీజె రమేష్‌ను, అనకాపల్లిలోని సిసిఎస్ సిఐ జి సంజీవరావును విశాఖ సిటీకి బదిలీ చేశారు. విశాఖ సిటీలో ఉన్న సిఐలు జె మురళీ, ఎస్ కాంతారావులను రేంజ్‌లోని విఆర్‌కు బదిలీ చేశారు.

చికిత్స పొందుతూ యాచకరాలు మృతి
విశాఖపట్నం(క్రైం), జనవరి 2: నగరంలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని యాచకురాలు మృతి చెందినట్టు హార్బర్ పోలీసులు బుధవారం తెలిపారు. హార్బర్‌లోని ఆదానీ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా తాటిచెట్లపాలెం, 80అడుగుల రోడ్డు సమీపంలో నివాసముంటున్న వినోద్‌రాజా పని చేస్తున్నాడు. తాను పని చేస్తున్న రోడ్డులో గత నెల 28న గుర్తు తెలియని వృద్ధురాలు పడి ఉండడాన్ని గమనించి వెంటనే 108అంబులెన్స్ ద్వారా కెజిహెచ్‌కు వినోద్‌రాజా తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి వయస్సు సుమారు 70సంవత్సరాల మేరకు ఉంటుందని, చామనఛాయ రంగులో గుర్తు తెలియని యాచకురాలిగా పోలీసులు గుర్తించారు. మృతురాలి బంధువులు ఎవరైన ఉంటే తమను సంప్రదించాల్సిందిగా హార్బర్ పోలీసులు తెలిపారు. కేసును హార్బర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.