విశాఖపట్నం

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,జనవరి 23: ఈ నెల 24వ తేదిన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం, బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీ ఈవో డివి రమణమూర్తి తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించే ఈ సర్వసభ్య సమావేశంతోపాటు, మధ్యాహ్నం నుంచి బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉన్నతాధికారులతో పాటు, ప్రజా పరిషత్ నాయకులు పాల్గొనాలన్నారు.

ఏపీ నర్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం నియామకం
విశాఖపట్నం,జనవరి 23: ఏపీ నర్సింగ్ అసోసియేషన్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గం బుధవారం కేజీహెచ్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షురాలు పి.వరలక్ష్మీ, కోశాధికారి శాంతమ్మ ఆధ్వర్యంలో నగరంలోని పలు ఆసుపత్రుల నర్శింగ్ సిబ్బందిని నూతన కమిటీలో నియమించారు. వీరిలోనూతనంగా ఏపీ నర్శింగ్ అసోసియేషన్‌లో ఉపాధ్యక్షురాలుగా టీబీ ఆసుపత్రి సీనియర్ హెడ్ నర్సు మద్దిరాల ఇందిర, ఈ ఎన్‌టీ ఆసుపత్రి హెడ్‌నర్సు ఎన్.ప్రశాంతి, మెంటల్ కేర్ ఆసుపత్రి స్ట్ఫా నర్సు డి.రాజేశ్వరి, వీజీహెచ్ స్ట్ఫానర్సు వి. ఉషారాణి, కేజీహెచ్ నర్శింగ్ సిబ్బంది జె.రవీంద్రనాథ్‌తో పాటు, కార్యవర్గ సభ్యులు పది మందిని నియమించారు. వీరిలోకేజీహెచ్‌లో నలుగురు, ఆర్ ఈహెచ్, మెంటల్‌కేర్, ఆర్‌సీడీ, అగనంపూడి, అనకాపల్లి సీహెచ్‌సీ, నర్శిపట్నం, పెందుర్తి, పాడేరు ఆసుపత్రిల్లో ఉన్న నర్శింగ్ సిబ్బందికి ఈ నూతన కమిటీలో ఈసీ సభ్యులుగా అవకాశం కల్పించారు. అయితే నూతనంగా కమిటీలో నియమించిన ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులంతా మూడు ఏళ్లు పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారని జిల్లా అధ్యక్షురాలు పి.వరలక్ష్మీ తెలిపారు. అనంతరం ఆయా బోధనాసుపత్రుల్లోని పలు పెండింగ్ సమస్యలపై చర్చించుకొవడంతో పాటు, అసొసియేషన్ బలోపేతమయ్యే విషయాలపై కూడా చర్చించారు.