విశాఖపట్నం

భద్రత మరింత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఐఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) దృష్ట్యా విశాఖ నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాల నేవీ అధికారులు నగరానికి వస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక భద్రతాదళాలు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే ఆదివారం తునిలో జరిగిన విధ్వంసకర సంఘటనను పురస్కరించుకుని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్పీజీ అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక భద్రతా సిబ్బంది ఉన్నతాధికారుల మరో బృందం సోమవారం నగరానికి చేరుకుంది. వీరంతా నేవీ హౌస్‌లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. తునిలో ఇంటిలిజెన్స్ వైఫల్యం వల్ల విధ్వంసకర సంఘటనలను నివారించలేకపోయారని అధికారులు అభిప్రాయపడ్డారు. దీనివలన భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. తుని ఘటనలో అల్లరిమూకలు విధ్వంసాన్ని సృష్టించాయి. విశాఖలో జరుగుతున్న ఫ్లీట్ రివ్యూని కూడా వారు అవకాశంగా తీసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఫ్లీట్ రివ్యూని తిలకించడానికి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. అలాగే బీచ్ రోడ్డులో ఇప్పటికే సిసి కెమేరాలతో పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకున్నా, వాటిని మరింతగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఔట్ పోస్ట్‌ల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటికే నగరానికి 15 వేల మంది పోలీస్ బలగాలు వచ్చాయి. వీటితోపాటు నేవీ పోలీసులను కూడా ట్రాఫిక్ నియంత్రణ కోసం వినియోగించనున్నారు.

నగరానికి ఐఎఫ్‌ఆర్ ఫీవర్
* ఎటు చూసినా సందడే!
* అహరహం శ్రమిస్తున్న యంత్రాంగం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: నగరానికి ఐఎఫ్‌ఆర్ ఫీవర్ వచ్చింది. నగరంలో ఎక్కడ చూసినా ఫ్లీట్ రివ్యూ గురించే చర్చించుకుంటున్నారు. ఫ్లీట్ రివ్యూని తిలకించడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మరోపక్క ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నగర సుందరీకరణ పనులు దాదాపూ పూర్తయ్యాయి. మిగిలిన పనులను బుధవారం నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెపుతున్నారు. ఫ్లీట్ రివ్యూకి తరలి వచ్చే విఐపిలకు ఆతిథ్యమిచ్చేందుకు అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది తెల్లవార్లూ పనిచేస్తున్నారు. మరోపక్క నేవీ అధికారులు రాష్టప్రతి, ప్రధానికి స్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతున్నారు. దేశంలో రెండోసారి, విశాఖలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎప్పటికీ గుర్తుండేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వివిధ అంశాలకు సంబంధించిన శకటాలు సిద్ధమవుతున్నాయి. బీచ్ రోడ్డులో ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లు చాలా వరకూ పూర్తయ్యాయి. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

విక్టరీ ఎట్ సీ వద్ద రిహార్సల్స్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని సందర్భంగా 1971లో పాకిస్థాన్-్భరత్ మధ్య జరిగిన యుద్ధంలో అసువులు బాసిన నౌకాదళ అమరవీరులకు నాలుగో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తారు. దీనికి సంబంధించి సోమవారం బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద రిహార్సల్స్ జరిగాయి.

క్షేత్ర స్థాయిలో పనుల నిర్వహణపై శ్రద్ధ చూపాలి
* ఐఎఫ్‌ఆర్‌లో ప్రదర్శనకు స్మార్ట్‌సిటీ నమూనా
* కమిషనర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: అంతర్జాతీయ స్థాయి వేడుకగా ఐఎఫ్‌ఆర్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పనులు మరింత శ్రద్ధగా నిర్వహించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా నగరంలో చేపట్టిన సుందరీకరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. సుందరీకణ పనులు ఎంతగా చేపట్టినప్పటికీ పారిశుద్ధ్య పనుల విషయంలో అలక్ష్యం వహిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదన్నారు. ముఖ్యంగా నగరంలో బహిరంగ మలవిసర్జన, చెత్త తదతర విషయాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాన్నారు. రాష్టప్రతి, ప్రధాని సహా పలువురు ప్రజాప్రతినిధులు, దేశ,విదేశాల నుంచి వస్తున్న అతిధులకు విశాఖ నగరం తన అందాలతో కనువిందు చేయాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు. నగరంలో ఎక్కడ చెత్త కన్పించినా ఆయా వార్డుల పరిధిలోని శానిటరీ ఇనస్పెక్టర్లు, ఇతర పారిశుద్ధ్య కార్మికలదే బాధ్యతగా భావించి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అనంతరం ఆయన నగరంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులు, బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు. హిందుస్థాన్ షిప్‌యార్డు పరిసరాల్లో చేపట్టిన రహదారి నిర్మాణం పనులు, సుందరీకరణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఐఎఫ్‌ఆర్ సందర్భంగా వచ్చే అతిధులకు విశాఖ స్మార్ట్‌సిటీ అంశాన్ని తెలియజెప్పే విధంగా స్మార్ట్‌సిటీ నమూనాను ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు. స్మార్ట్‌సిటీ నమూనా ఏర్పాటులో యంత్రాంగానికి అవసరమైన సూచనలు ఇచ్చారు. పర్యటనలో ఆయన వెంట జోనల్ కమిషనర్లు పి నల్లనయ్య, వై శ్రీనివాసరావు, సిహెచ్ నాగనరసింహారావు, హార్టీకల్చర్ ఎడి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్ధేశించిన పనులు సమర్ధవంతంగా నిర్వహించండి
* జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా విధులను నిర్వహించనున్న అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. ఐఎఫ్‌ఆర్ విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బందితో సమీక్షించిన కమిషనర్ వారికి ఉత్తర్వులు అందజేశారు. ఎవరికి కేటాయించిన పనులను వారు సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ వేడుకల్లో ఎటువంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి అంశాల్లో బాధ్యతలు చూస్తున్న అధికారులు అప్పగించిన పనులను రాజీపడకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ జివివిఎస్ మూర్తి, సూపరింటిండెంట్ ఇంజనీర్ వి చంద్రయ్య, జివిఎంసిలోని అన్ని విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

రోడ్లపై పశువులను వదిలేస్తే జరిమానా
విశాఖపట్నం (జగదాంబ), ఫిబ్రవరి 1: జివిఎంసి పరిధిలో రోడ్లపై పశువులను వదిలేస్తే కఠిన చర్యలు తప్పవని సిటీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఎల్‌కె సుధాకర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. పశువులను రోడ్లపై వదిలేయడం వల్ల తరచు అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.దీనితో పాటు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో పశువుల కారణంగా నగర అందాలు దెబ్బతింటున్నాయన్నారు. సుందరీకరణ చర్యల్లో భాగంగా సెంటర్ మీడియన్లు, రహదార్లకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నాయన్నారు. ఇకమీదట వీటిని రోడ్లపై వదిలేస్తే వాటి యజనానుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయడంతో పాటు వారిపై నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. పశువుల సంచారాన్ని నియంత్రించేందుకు జివిఎంసి యంత్రాంగం ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు వెల్లడించారు.

విధి నిర్వహణలో అలక్ష్యం
* శానిటరీ ఇనస్పెక్టర్ సస్పెన్షన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఎంతో ప్రతిష్టాత్మకంగా నగర అందాలను తీర్చిదిద్దుతున్న తరుణంలో విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ ఇనస్పెక్టర్‌ను జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం సస్పెండ్ చేశారు. జివిఎంసి పరిధిలోని 22వ వార్డు జాలరిపేటలో పారిశుద్ధ్య పనులపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించలేదని గుర్తించిన కమిషనర్ శానిటరీ ఇనస్పెక్టర్ రామ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జాలరిపేటలో బహిరంగ మల విసర్జనను పూర్తి స్థాయిలో నియంత్రించాలని కమిషనర్ గతంలోనే ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐఎఫ్‌ఆర్ వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో జాలరిపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు ఘోరంగా ఉన్నట్టు కమిషనర్ గుర్తించారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనుల నిర్వహణలో శానిటరీ ఇనస్పెక్టర్ పూర్తిగా విఫలమైనట్టు గుర్తించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్ చేశారు.

సమన్వయంతో విధులు నిర్వహించండి
* ఐఎఫ్‌ఆర్‌పై కలెక్టర్ సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: విశాఖ వేదికగా ఈ నెల 4 నుంచి 8 వరకూ జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) విధులను సమర్ధవంతంగాను, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎన్ యువరాజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఐఎఫ్‌ఆర్‌పై జిల్లా అధికారులతో సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టప్రతి, ప్రధాని సహా పలువురు ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. సమన్వయ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. విమానాశ్రయం నుంచి వచ్చే అతిధులను వారికి కేటాయించిన బసల వద్దకు చేర్చడంతో పాటు అక్కడ్నుంచి వేడుకలకు తీసుకువచ్చే బాధ్యతను విస్మరించవద్దదని స్పష్టం చేశారు. ఈ విషయంలో యంత్రాంగం పూర్తి సమన్వయంతోను, అప్రమత్తతతోను వ్యవహరించాలన్నారు. ప్రముఖులు ఏ సమయంలో వేడుకలకు హాజరుకావాన్న అంశంపై ఫ్లీట్ రివ్యూ టైం షెడ్యూల్‌ను వారికి అందజేయాలన్నారు.
ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో తొలి అంకంలో ఫిబ్రవరి 4న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయంత్రం 4 నుంచి 4.35 గంటల వరకూ బీచ్‌రోడ్డులోని అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పిస్తారని, అనంతరం ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ నేవల్ స్టేడియంలో ఐఎఫ్‌ఆర్ వేడుకలను ప్రారంభిస్తారని తెలిపారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11.45 గంటల వరకూ ఆర్‌కె బీచ్‌లోని అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, సాయంత్రం 5.20 గంటల నుంచి 6.30 గంటల వరకూ సముద్రికలోని నేవీ బ్యాండు కచేరీలో పాల్గొంటారని తెలిపారు. అదేరోజు రాత్రి 7.25 గంటల నుంచి 9 గంటల వరకూ తూర్పు నౌకాదళ మెస్‌లో గౌరవ విందులో పాల్గొంటారన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకూ ఆర్‌కె బీచ్‌లో విన్యాసాలను తిలకిస్తారన్నారు. సాయంత్రం 6.20 గంటల నుంచి 6.58 గంటల వరకూ అంతర్జాతీయ సిటీ పరేడ్‌లో పాల్గొంటారన్నారు. అదే రోజు రాత్రి 7.15 నుంచి 9.30 వరకూ నోవాటెల్ హోటల్‌లో నేవల్ ప్రతినిధులు, అతిధుల పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరి 8న నేవల్ ఇనిస్టిట్యూట్‌లో అంతర్జాతీయ నౌకా విన్యాసాల ప్రదర్శన ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. సమావేశంలో ప్రోటోకాల్ కార్యదర్శి అశోక్‌బాబు, వుడా విసి బాబూరావు నాయుడు, జాయింట్ కలెక్టర్ డివి రెడ్డి, డిఆర్‌ఓ చంద్రశేఖర రెడ్డి, ఎఓ ప్రకాశరావు, జిల్లా అధికారులు, హోటల్ యజమానులు పాల్గొన్నారు.

డిఎస్సీకి 2,576 మందికి అర్హత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: డిఎస్సీ 2014కు సంబంధించి 2,576 మంది అర్హత సాధించినట్టు జిల్ల విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 724 పోస్టులకు గాను 7,268 మంది దరఖాస్తు చేసుకోగా, 6,319 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 2,576 మంది మాత్రమే అర్హత పొందారన్నారు. ఎస్‌జిటి (తెలుగు)లో 667 పోస్టులకు గాను 1,980 మంది అర్హత పొందారని తెలిపారు. ఎస్‌జిటి (ఉర్దూ)లో 9 పోస్టులకు గాను ఒకరు మాత్రమే అర్హత సాధించారు. భాషాపండితులు (తెలుగు) ఒక పోస్టుకుగాను 365 మంది అర్హత సాధించగా, భాషాపండితులు (హిందీ) 46 పోస్టులకు గాను 230 మంది అర్హత సాధించారన్నారు. భాషాపండితులు (ఉర్దూ) 1 పోస్టుకు గాను ఒక్కరు కూడా అర్హత సాధించలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలను ఎపిడిఎస్సీ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్‌లో పొందుపరచినట్టు తెలిపారు.

చావులమదుం బ్రిడ్జికి కొత్త హంగులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఒకప్పుడు ఆ మార్గంలో నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. మోకాలి లోతు మురుగునీటిలోనే ప్రయాణం. తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ అపారిశుద్ధ్యంతో రోత పుట్టించే విధంగా ఉండేదా మార్గం. సుందర విశాఖకు మాయనిమచ్చగా నిలిచిపోతుందనుకున్న చావులమదుం రైల్వే అండర్ బ్రిడ్జి ఇప్పుడు చూడముచ్చటగా హోయలొలికిస్తోంది. గోడలపై అందమైన చిత్రాలు, రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, సెంటర్ మీడియన్‌లో రంగురంగుల పూల మొక్కలతో తళుక్కు మంటోంది. దశాబ్ధాలుగా ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోపోగా, ఇక ఎప్పటికీ చావుల మదుం బ్రిడ్జి ఇలాగే ఉంటుందనుకుని సరిపెట్టుకుంటున్న తరుణంలో జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ దృష్టిలో పడింది. అస్తవ్యస్తమైన డ్రైనేజీ పోర్టు వ్యర్థాలతో కప్పబడి అపారిశుద్ధ్యానికి చిరునామాగా నిలిచిపోవాల్సిన రైల్వే బ్రిడ్జిని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలుత డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దే పనికి శ్రీకారం చుట్టారు. లోపాన్ని గుర్తించి, మురుగునీరు సక్రమంగా పోయేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మురికికూపం లాంటి అండర్ పాత్ బ్రిడ్జికి కొత్త రూపును తీసుకురావడంలో కమిషనర్ విజయం సాధించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విశాఖతో ఈ బ్రిడ్జిని ఒక సుందర జ్ఞాపకంగా మర్చేశారు. మురుగునీరు మచ్చుకైనా లేకుండా చేశారు. ఇక పురాతన బ్రిడ్జి గోడలు పోర్టు బొగ్గు ధూళితో చూసేందుకు రోత పుట్టించే గోడలకు కొత్త రూపును తెచ్చారు. అందమైన చిత్రాలు, గార్డెన్లను గోడలకు అద్దారు. ఇక బ్రిడ్జికి అటు,ఇటుగా సెంటర్ మీడియన్‌లలో రంగు,రంగుల పూల మొక్కలను నాటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో నగరం అంతటా సుందరీకరణ పనులు చేపట్టిన జివిఎంసి అంతకు ముందే చావులమదుం రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేసింది. తాజాగా చేపట్టిన సుందరీకరణలో భాగంగా బ్రిడ్జికి కొత్త హంగులు అంద్దింది.

సర్వాంగ సుందరంగా విమానాశ్రయం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు రూ.5.5 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో వినామాశ్రయానికి నూతన హంగులు కల్పించారు. ఐఎఫ్‌ఆర్‌కు భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సహా 52 దేశాల నుంచి నౌకాదళ అధికారులు హాజరుకానున్నారు. వీరంతా విమానాల్లోనే విశాఖకు తరలిరానున్న దృష్ట్యా విమానాశ్రయాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దారు. విమానాశ్రయం ఆవరణలో అందమైన లాన్లు ఏర్పాటు చేశారు. అందమైన, అరుదైన మొక్కలు, పూల మొక్కలతో అలంకరించారు. కృత్రిమ పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు. ల్యాండ్ స్కేపింగ్‌తో విమానాశ్రయ ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. అరుదైన పూల మొక్కలను తీసువచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. అలాగే కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఖరీదైన లైట్లను, నీటి ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో రంగు,రంగుల విద్యుద్దీప కాంతుల్లో ఫౌంటెన్లు మెరిసిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం విశాఖ విమానాశ్రయాన్ని చూస్తే సింగపూర్, మలేషియా, జపాన్ దేశాల్లోని ఎయిర్‌పోర్టులకు ఏమాత్రం తీసిపోదనిపించేలా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. ఇక విమానాశ్రయం బయట రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లను ఏర్పాటు చేశారు. ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటున్న దేశాల జాతీయ పతాకాలను ఏర్పాటు చేశారు.

ఎయు యుజిసి, హెచ్‌ఆర్‌డి విభాగంలో గ్రంధాలయం ఏర్పాటు
ప్రారంభించిన విసి జిఎస్‌ఎన్ రాజు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఆంధ్రాయూనివర్శిటీ యుజిసి, మానవవనరుల విభాగంలో నూతన గ్రంధాలయాన్ని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి రాజు మాట్లాడుతూ మానవవనరుల విభాగంలో విలువైన గ్రంధాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇక్కడకు శిక్షణ నిమిత్తం వస్తున్న యూనివర్శిటీ అధ్యాపకులకు విలువైన పుస్తకాలు, జర్నల్స్, వార్తా పత్రికలు, కంప్యూటర్ సదుపాయాన్ని కల్పించే విషయంలో యుజిసి, హెచ్‌ఆర్‌డి సంచాలకులు ప్రొఫెసర్ శ్రీరాములును అభినందించారు. ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని అధ్యాపకులు బోధనా పద్ధతులను మెరుగుపరచుకుంటూ, మెళకువలు అభ్యాసం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎయు రెక్టార్ ప్రొఫెసర్ ఇఎ నారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి ఉమామహేశ్వర రావు, యుజిసి, హెచ్‌ఆర్‌డి ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్ పాల్, ముసలయ్య, చంద్రయ్య, ఎయు ఇంజనీర్ మాధవబాబు, ఎయు ఎన్‌ఎస్‌ఎస్ అధికారి ఎస్ హరినాథ్, సిబ్బంది పాల్గొన్నారు.

గందరగోళం మధ్య రైల్వే అర్బన్ బ్యాంక్ డెలిగేట్ల ఎన్నికలు
* నిలుపుదల ఉత్వర్వుల విడుదల
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ప్రతిష్టాత్మకమైన రైల్వే అర్బన్ బ్యాంక్ డెలిగేట్స్ ఎన్నికలు ఎట్టకేలకు జరుగనున్నాయి. గత ఏడాది ఏప్రిల్-జూలై మధ్య ఇవి జరగాల్సి ఉందని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్, కార్యాలయ కార్యదర్శి యు.ఈశ్వరరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. అయితే అనేక సమస్యలు తలెత్తడంతో ఇప్పటి వరకు ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయన్నారు. రైల్వే అర్బన్ బ్యాంకు యాజమాన్యం అసమర్ధతతో కోర్టు ఉత్తర్వులు నిలుపుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఆర్ధిక నేరాలు, అధికార దుర్వినియోగం అక్రమాలతో కూరుకుపోయిన రైల్వే అర్బన్ బ్యాంకు చివరకు ఎన్నికలు నిర్వహించలేకపోయిందన్నారు. 107 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్న రైల్వేఅర్బన్ బ్యాంక్‌కు 35 ఏళ్ళుగా ఒకే యాజమాన్యం ఉందని, చివరకు వాయిదాల వేస్తూ వస్తోన్న ఎన్నికలకు సంబంధించి కోల్‌కత్తా కోర్టు తీసుకున్న నిర్ణయంతో వీటికి మోక్షం లభించనుందన్నారు. ఆర్ధిక నేరాలు, బ్యాంకు మహిళా సిబ్బందిపై కక్షసాధింపు, సిబిఐ, రైల్వే విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయన్నారు. సకాలంలో జరగని కారణంగా బ్యాంకు యాజమాన్యం అధికారంలో కొనసాగే అర్హత లేదని, తక్షణమే తప్పుకోవాలని, తక్షణమే విధుల నుండి తొలగించాలని న్యూఢిల్లీ సెంట్రల్ రిజిస్ట్రార్ కో-ఆపరేటివ్ సొసైటి నాయకత్వంలో జరపాల్సిందిగా కోరారు.

ఐఎఫ్‌ఆర్ విద్యుత్ ఏర్పాట్లు పూర్తి
* అందుబాటులో మూడు మెగావాట్ల విద్యుత్
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: వచ్చేనెల నాల్గవ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు అవసరమైన విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయి. దాదాపుగా 45 రోజులపాటు రేయింవబళ్ళు అనే తేడా లేకుండా నిర్వహించిన పనులను పూర్తిచేయగలిగారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశాలపై ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.సత్యనారాయణమూర్తి పర్యవేక్షణలో ఐఎఫ్‌ఆర్‌కు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చగలిగారు. అయితే ఐఎఫ్‌ఆర్ కోసం ఇప్పటికే తూర్పునౌకాదళం అత్యంత అధునాతనమైన జనరేటర్లను భారీగా ఏర్పాటు చేసుకోగలిగింది. పొరపాటున ఎక్కడైనా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ను వాడాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తం మీద ఈ విధంగా అందుబాటులోకి వచ్చిన విద్యుత్‌ను భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. అందువలనే ఏకంగా ముఖ్యమైన నాలుగు సబ్‌స్టేషన్ల సామర్ధ్యాన్ని పెంపొందించారు. ఆర్‌కె బీచ్, ఔటర్ హార్బర్, ఆర్‌సిడి ఆసుపత్రి, పాండురంగాపురం ప్రాంతాల్లో ఉన్న సబ్‌స్టేషన్ల సామర్ధ్యాన్ని సంస్థ పెంచగలిగినట్టు ఈపిడిసిఎల్ జోన్-1 డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎల్.మహేంద్రనాద్ తెలిపారు. వీటితోపాటు మరో 16 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల విద్యుత్ సామర్ధ్యం పెరిగిందన్నారు. వీటన్నింటినీ సామర్ధ్యం పెంపుతో ఈ వేసవి సీజన్‌లో అంతరాయాలు, లోవోల్టేజీ సమస్యలను సులభంగా అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఐఎఫ్‌ఆర్‌కు మూడు మెగావాట్ల విద్యుత్‌ను సిద్ధం చేసామని, ఇందుకోసం దాదాపు మూడు కోట్ల రూపాయల ఖర్చయినట్టు ఆయన తెలిపారు. సముద్రతీర ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఎక్కడా విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.

జివో 28ని రద్దు చేయాలి
* ఏపీ వైద్యమిత్ర ఉద్యోగుల డిమాండ్
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: జివో 28ని వెంటనే రద్దు చేయాలని, ఎన్టీఆర్ వైద్యమిత్ర ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ జిల్లావైద్యశాఖ కార్యాలయం ఎదుట వైద్యమిత్ర ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారంతో ఐదవ రోజుకి చేరుకున్నాయి. దీనిని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల రమణ, కార్యవర్గసభ్యులు జి.వామనమూర్తిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యమిత్ర విభాగంలో గత ఎనిమిదేళ్ళుగా పనిచేస్తున్న వైద్యమిత్ర ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగుల బతుకులతో చెలగాటం ఆడోద్దని ఉద్యోగులు సహనం కోల్పోకముందే సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, వైద్యమిత్ర ఉద్యోగుల కష్టాలు గురించి ముఖ్యమంత్రిపై వత్తిడి తెచ్చి మిత్ర ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షలో బి.కరుణ, సత్యవతి, రమాదేవి, ఎల్.దీపిక, జి.అనిల్‌కుమార్, జె.శ్రీనివాసరావు, సరస్వతి, జయమణిలు పాల్గొన్నారు.

పడిపోయిన ఆర్టీసీ ఆదాయం
* సంక్రాంతి సీజన్‌తో సరి
* అరకొర బస్సులతో అవస్థలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఆర్టీసీ ఆదాయం మళ్ళీ పడిపోయింది. ఒక్క సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదీ పండుగ రోజుల్లో వారం రోజులు మాత్రమే రోజుకీ రూ.90 నుంచి కోటి రూపాయల మేర ఆదాయం వచ్చేది. ఆ తరువాత నుంచి రోజుకీ దాదాపు రూ.75 లక్షలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకే ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని రాబట్టగలిగిన ఆర్టీసీ విశాఖ రీజియన్ ఇపుడు మళ్ళీ చతికిలపడింది. అసలే చాలీచాలనీ బస్సులు, వీటిలో కొన్ని మర్మత్తులకు నోచుకోవడంలేదు. హైదరాబాద్, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు నడిచే కొన్ని బస్సులు మాత్రమే ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలో నడుస్తోన్న కొన్ని రూట్లలో పల్లెవెలుగులు, పాసింజర్ బస్సుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం గత ఏడాది కాలంగా పెరగడంలేదంటూ సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా పది ఆర్టీసీ డిపోలుండగా, ఇందులో పాడేరు డిపో పరిధిలో బస్సుల నిర్వహణతో గత కొనే్నళ్ళుగా సంస్థ నష్టాలనే ఎదుర్కొంటోంది. నర్సీపట్నం డిపో ఓ మోస్తారుగా ఉంది. విశాఖ నగరంలో రూరల్, మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక డిపోల పరిధిల్లో నడిచే సిటీల ద్వారా ఆదాయం వస్తున్నా, సిటీల కొరత తీవ్రంగా ఉంది. ఆదాయాన్ని తెచ్చిపెట్టే పలు రూట్లలో కొత్తగా సిటీ సర్వీసులు రావాల్సి ఉన్నా దీనికి ఏళ్ళు పడుతోంది. నగర జనాభాకనుగుణంగా వెయ్యికి పైగానే సిటీ సర్వీసులు నిర్వహించాల్సి ఉండగా, ఇందులో 60 శాతం మాత్రమే నడుస్తున్నాయి. అందువల్ల నగర శివారు ప్రాంతాల ప్రజలు నిత్యం రవాణా సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల ఆర్టీసీ ఆదాయం కాస్త ఆటోలకే వెళ్ళిపోతోంది. అద్దె బస్సుల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. పాసింజర్, ఎక్స్‌ప్రెస్‌లతోపాటు, సిటీ సర్వీసులు భారీగా పెరగాల్సి ఉందని, అపుడే ఆటోల ఇష్టారాజ్యానికి కళ్ళెం వేసినట్టు అవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం భోజన సమయంలోను, రాత్రిళ్ళు తొమ్మిది గంటలు దాటిన తరువాత సరైన సిటీ బస్సుల సౌకర్యం లేక శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో దుకాణాలు, చిన్నతరహాపరిశ్రమలు, షాపింగ్‌మాల్స్, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు ఇళ్ళకు చేరుకోవాలంటే రాత్రిళ్ళు అవస్థలు పడాల్సిందే. చివరకు అధిక చార్జీలు చెల్లిస్తూ ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. అవసరమైన సిటీ సర్వీసులు అందుబాటులో ఉంటే ఆశించిన స్థాయిలోనే ఆదాయం వచ్చేది.

ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్‌ఎంయు గెలుపు తథ్యం
* ఎన్‌ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ఆర్టీసీలో కార్మికు సంఘాలకు జరిగే ఎన్నికల్లో ఎన్‌ఎంయు విజయకేతనం ఎగురవేయనుందని ఆర్టీసీ ఎన్‌ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన జరిగే ప్రతిష్టాకరమైన ఎన్నికల్లో కార్మికులు ఎన్‌ఎంయును భారీ మెజారిటీతో గెలిపించాలనే తపనతో ఉన్నారన్నారు. మూడేళ్ళకాలంలో గుర్తంపుయూనియన్‌గా చలామణి అయిన ఎంప్లారుూస్ యూనియన్ తెలంగాణా యూనియన్లతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. గడిచిన మూడేళ్ళల్లో కండక్టరు, డ్రైవర్, మెకానిక్, శ్రామిక్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా డ్రైవర్, కండక్టర్ విధులు నిర్వహించవచ్చని అగ్రిమెంటు చేసి కార్మికులకు ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రంలో 40 వేల సభ్యులున్న ఎన్‌ఎంయు యూనియన్‌ని పణంగా పెట్టి ఎటువంటి సమ్మె నోటీసు ఇవ్వకుండా ఇయుకు మద్దతుగా సమ్మెలో పాల్గొని 43 శాతంఫిట్ సాదించడంలో కీలకపాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయతే వాళ్ళే సాధించినట్టు చెప్పుకుంటూ నాటి మంత్రివర్గంలో జరిగిన ఒప్పందాన్ని పక్కనుపట్టె ఏరియర్స్, ఫెస్టివల్ అడ్వాన్సు, ఎన్‌క్యాషన్‌మెంటు, సర్వీసు కండిషన్స్ ఇప్పించడంలో తీవ్ర వైఫల్యం చెందారన్నారు. ఏరియర్స్‌ను బాండ్ల రూపంలో ఇప్పించి ఎపుడో రిటైరు అయ్యే వరకు ఆర్ధికంగా తీవ్ర నష్టం కలిగించారన్నారు. రిటైరు అయిన కార్మికులకు నేటికీ ఏరియర్స్‌గానీ, సెటిల్‌మెంట్లు గానీ చేయకుండా గుర్తింపుకాలాన్ని ఏడాదిపాటు యాజమాన్యం వద్ద పొడిగించుకునేటట్టు చేసుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలుపుకోకపోగా ఎస్‌ఆర్‌బిఎస్, ఎస్‌బిటి, సిసిఎస్, పెన్షన్‌లను యాజమాన్యానికి తాకట్టు పెట్టారన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీనిచ్చి నాలుగు సంక్రాంతిలు దాటినా రెగ్యులర్ చేయించలేదన్నారు. తాము ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం సమైక్యాంధ్ర 60రోజులు, ఆర్‌పిఎస్ కోసం చేసిన ఎనిమిది రోజుల సమ్మెకాలంలో జీతాలు ఇప్పిస్తామని, 29 ఏళ్ళు పూర్తి చేసిన వారందరికీ పదోన్నతి కల్పిస్తామని, డిస్పెన్సరీల నందు పనిచేసే వారికి పదోన్నతులు, రిస్క్ ఎలవెన్స్‌లు ఇప్పిస్తామన్నారు. అలాగే పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కుటుంబపోషణ నిమిత్తం ఇంకొక నూతన పెన్షన్ ప్రవేశపెడతామని, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి రెగ్యులర్ చేయిస్తామని, రూట్ సర్వేతో సంబంధం లేకుండా గంటకు ఇన్ని కిలోమీటర్లు తిరగాలనే ఇయు చేసిన ఒప్పందం రద్దు చేయిస్తామన్నారు. ఇటువంటివి మరెన్నో సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జోనల్ కార్యదర్శి పివివి మోహన్, నందగోపాల్, రీజనల్ కార్యదర్శి పిఎన్ రావు, రీజనల్ అధ్యక్షులు వి.అప్పారావు, అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏకె శివాజీ, పిఎన్ మూర్తి, జెఎం నాయుడులు పాల్గొన్నారు.

పలు రైళ్ళు రీ షెడ్యూల్
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: పలు రైళ్ళు రీ షెడ్యూల్ చేయబడ్డాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్ (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్ చేయడంతో ఇది సోమవారం సాయంత్రం ఉదయం 9.30గంటలకు బయలుదేరి వెళ్ళింది. వాస్తవానికి ఇది ప్రతిరోజు ఉదయం 6.15గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాల్సి ఉంది. అలాగే విశాఖపట్నం-న్యూఢిల్లీ (22415) ఏసీ ఏపీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.45గంటలకు బయలుదేరి వెళ్ళాల్సింది 11.30గంటలకు కదిలింది. విశాఖపట్నం-తిరుపతి (17488) తిరుమల ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం రెండు గంటలకు బదులుగా మూడు గంటలకు బయలుదేరింది. వీటితోపాటు మరికొన్ని రైళ్ళు రీ షెడ్యూల్‌తో నడుస్తున్నాయి. భువనేశ్వర్-సిఎస్‌టిఎం (11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.25గంటలకు బదులుగా సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరింది. చెన్నై సెంట్రల్-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (12842) ఉదయం 8.45గంటలు వెళ్ళాల్సింది సాయంత్రం నాలుగు గంటలకు, సికింద్రాబాద్-్భవనేశ్వర్ (17016) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.50గంటలకు బదులుగా రాత్రి 6.50గంటలకు బయలుదేరింది. అలాగే బెంగుళూరు-దిబ్రుగర్ (15901) ఎక్స్‌ప్రెస్ సోమవారం రాత్రి 11.55గంటలకు బయలదేరాల్సి ఉండగా, ఇది మంగళవారం ఉదయం ఆరుగంటలకు బయలుదేరుతుంది. తిరుపతి-విశాఖపట్నం (17487) రాత్రి 8.30గంటలకుగాను రాత్రి 10.30గంటలకు, హైదరాబాద్-విశాఖపట్నం (22204) దురంతో ఎక్స్‌ప్రెస్ రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, రాత్రి 11.50గంటలకు బయలుదేరుతుంది. చెన్నైసెంట్రల్-పూరి (22860) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.25గంటలకు బదులుగా రాత్రి 10.30గంటలకు చెన్నైలో బయలుదేరుతుంది. హౌరా-చెన్నై సెంట్రల్ మెయిల్ (12839) సోమవారం రాత్రి 11.45గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ఇది మంగళవారం ఉదయం 5.30గంటలకు హౌరాలో బయలుదేరనుంది. తిరుపతి-్భవనేశ్వర్ (22872) ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12.45గంటలకుగాను రాత్రి ఏడు గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. తిరుపతి-చత్రగాఛీ (22856) ఎక్స్‌ప్రెస్ సోమవారం రాత్రి 7.55గంటలకు బదులుగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరుతుంది.

తీరప్రాంత కట్టడాల నాణ్యతను పెంపొందించాలి
* నిపుణులు అధ్యయనాలు అవసరం
* రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: తీరప్రాంతాల్లో చేపట్టే భారీ నిర్మాణాల్లో అధునాతన సాంకేతికతను వినియోగిస్తొ, విపత్తులను తట్టుకునే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఏయు రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహిస్తున్న ‘డిజైన్ ఆఫ్ కోస్టల్ అండ్ ఆఫ్‌షోర్ స్ట్రక్చర్స్ స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి శిక్షణల్లో అందించిన విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ విద్యార్ధులు సృజనాత్మక ఆవిష్కరణలను జరపాలన్నారు. రానున్నకాలంగా రాష్ట్రంలో తీర ప్రాంత పరీవాహకం పూర్తిస్థాయిలో అభివృది