విశాఖపట్నం

నేటి నుంచి ఎన్‌ఎంయు రాష్టవ్య్రాప్త దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: ఆర్టీసీ ప్రధా న కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలనే యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికుల రిలే నిరాహారదీయలు నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ ఎన్‌ఎంయు రీజనల్ కార్యదర్శి పి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఎంయు విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె బస్సులనందు ప్రైవేటు వ్యక్తులకు టిమ్ ఇవ్వడానికి ఎన్‌ఎంయు రాష్ట్ర కమిటీ అభ్యంతరం తెలుపుతుందన్నారు. సంస్థ ఎండి అద్దె బస్సుల్లో కండక్టర్లతో టిమ్‌తో నడిపేందుకు యాజమాన్యం అంగీకరించి అమలుపరుస్తుందుకు నిరసనగా అన్ని డిపోల వద్ద సామూహిక నిరాహారదీక్షలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికైనా యాజమాన్య అద్దె బస్సుల నందు సంస్థకు చెందిన కండక్టర్లతో తిప్పేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు హైదరాబాద్‌నందు (బస్ భవన్, తార్నాక ఆసుపత్రి, కల్యాణమండపం, ట్రైనింగ్ సెంటర్) ఇటువంటి 13 రకాల ఆస్తులు సుమారు 25వేల కోట్ల రూపాయల మేర ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. షీలాబేడీ కమిటీ నిర్ణయం ప్రకారం 52 శాతం ఆస్తులు మనకు రావాల్సి ఉండగా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం హెడ్ ఆఫీస్‌ను విజయవాడకు తరలించడానికి ఎన్‌ఎంయు చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికైనా సంస్థ ఆస్తులు వచ్చే విధం గా చొరవ చూపాలని, ఎన్‌ఎంయు రాష్ట్ర కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. అలా గే హైర్ బస్సుల్లో కండక్టర్లను టిమ్‌తో తిప్పాలన్నారు.ఈ సమావేశంలో అర్బన్ డివిజనల్ కార్యదర్శి ఏకె శివాజీ, విశాఖ డిపో సంయుక్త కార్యదర్శి ఎమ్‌ఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు.