విశాఖపట్నం

రైల్వే పింఛన్‌దారులకు ప్రత్యేక సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: రైల్వే పింఛనుదారులకు మరింత సౌలభ్యంగా ఉండే విధంగా తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు మండలం పరిధిలో ప్రత్యేక సౌకర్యాన్ని సోమవారం డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ ప్రారంభించారు. దీంతో జీవన ప్రమాణ కేంద్రం అందుబాటులోకి వచ్చినట్టు అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫించనుదారులు జీవన ప్రమాణ కేంద్రాన్ని సందర్శించి, ఆధార్ నెంబర్ దూరవాణి నెంబర్, ఫించను చెల్లింపు ధృవపత్రం నెంబరు, బ్యాంక్ ఖాతా నెంబరు, శాఖ (ఐఎఫ్‌ఎస్‌సి నెంబరు) పేరు, చిరునామా అందజేయాల్సిందిగా ఆమె సూచించారు. ఫించను దారు బయోమెట్రిక్ ఆధారాన్ని పొందాలన్నారు. ఫించనుదారు ప్రమాణపత్రం నెంబర్ చరవాణికి సంక్షిప్త సమాచారం ద్వారా పొందలగరన్నారు. కంప్యూటర్ సహాయంతో ప్రమాద పత్రాన్ని జీవనప్రమాణ్,జివోవి.ఇన్‌కు లాగ్ ఆన్ అయి ప్రమాణ్ నెంబరు/ ఆధార్ నెంబర్, ఉపయోగించి పొందగలరన్నారు. ఫించను చెల్లింపు బ్యాంకుకు జీవన్ ప్రమాణ పత్రం నెంబర్‌ను తెలియజేయాల్సిందిగా ఆమె పేర్కొన్నారు.