విశాఖపట్నం

శాశ్వత ప్రాతిపదికన ఎయు లైబ్రేరియన్ నియామకం జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని విఎస్ కృష్ణా గ్రంథాలయం దాదాపు దశాబ్ద కాలంగా శాశ్వత ప్రాతిపదికన లైబ్రేరియన్ నియామకానికి నోచుకోలేదు. వివిధ విభాగాలకు చెందిన ఆచార్యులను తాత్కాలిక ప్రాతిపదికన ఇన్‌ఛార్జిలుగా నియమిస్తూ ఎయు అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఎయు లైబ్రరీలో దాదాపు 5.2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. దీనికి తోడు 2900 తాళపత్ర గ్రంథాలు, పేపరుపై రాసిన గ్రంథాలు (పేపరు స్క్రిప్ట్) మరో 3000 దాకా ఉన్నాయి. రాష్ట్రంలో ఇన్ని పుస్తకాలు కలిగిన గ్రంథాలయం ఇదే అని చెప్పవచ్చు. దేశ విదేశాల నుంచి పరిశోధనల నిమిత్తం విద్యార్థులు వస్తుంటారు. ఎయు విద్యార్థులు కూడా రిఫరెన్సు కోసం వస్తుంటారు. ఏడవ శతాబ్దానికి చెందిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాలు, వ్యాకరణం, గణితం, జ్యోతిష్యం తదితర అంశాలపై తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇంత విలువైన పుస్తక సంపద ఉన్న గ్రంథాలయం నిర్లక్ష్యం నీడలో ఉందనవచ్చు. ఈ గ్రంథాలయానికి శాశ్వత ప్రాతిపదికపై లైబ్రేరియన్‌ను నియమించేందుకు వీలుగా పోస్టు మంజూరైనప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. దీంతో దాదాపు 12 సంవత్సరాలుగా వివిధ విభాగాల నుంచి ఆచార్యులను ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమితులవుతున్న ఆచార్యులు గ్రంథాలయ నిర్వహణ, విలువైన పురాతన గ్రంథాల నిర్వహణపై అంతగా దృష్టి సారించలేని స్థితి నెలకొంది. ఒకసారి లైబ్రేరియన్‌ను నియమించినప్పటికీ సంవత్సరంలోగా పదవీ విరమణ చేయడం గమనార్హం. హుదూద్ తుపాను కారణంగా కొన్ని పుస్తకాలు పాడైనప్పటికీ విలువైన తాళపత్ర గ్రంథాలు పదిలంగా ఉండటం గమనార్హం. కానీ వాటికి నిర్ణీత కాలానికి కొన్ని పరిరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే తాళపత్ర గ్రంథాలు పాడైపోతాయి. వీటి నిర్వహణకు వీలుగా శిక్షణ కలిగి ఉన్న సిబ్బంది లేరు. వర్సిటీలోని వివిధ విభాగాల నుంచి సిబ్బందిని ఇక్కడకు బదిలీ చేస్తారు. ఇందుకు అవసరమైన ఒక కోర్సులో ఉత్తీర్ణులైన వారిని నియమిస్తారు. గ్రంథాలయానికి బదిలీ చేయడం ద్వారా జీతంలో పెరుగుదల ఉంటుంది. అయితే పురాతన గ్రంథాలను, విలువైన పుస్తకాలను నిర్వహణకు అవసరమైన నైపుణ్యం లేదన్న ప్రచారం ఉంది. తాళపత్ర గ్రంథాల నిర్వహణపై తగిన నైపుణ్యం లేకపోవడంతో ఇటీవల కొంతమందికి అవగాహన కల్పించేందుకు వీలుగా వర్కుషాపును నిర్వహించారు. దీనికి తోడు కొన్ని అరుదైన పుస్తకాలను, గ్రంథాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ, మధ్యలో నిలిపివేశారు. అరుదైన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలను భావితరాలకు అందించేందుకు వీలుగా డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు కొన్ని విదేశీ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ మేరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. విలువైన గ్రంథాల పరిరక్షణకు కొంతమంది దాతలు ఆర్థిక సాయం అందించేందుకు ఆసక్తి ఉన్నా, దానిని ఉపయోగించుకునే ఆసక్తి ఎయు అధికారులకు లేకపోవడం గమనార్హం. గ్రంథాలయంలోని అతి విలువైన పుస్తకాలను తొలిదశలో డిజిటలైజేషన్‌కు అయ్యే ఖర్చును అంచనా వేసి, ఒక పుస్తకానికి అయ్యే ఖర్చును ఖరారు చేసి దాతలను ఆహ్వానిస్తే నిధులు సమకూరే అవకాశం ఉంది. విలువైన గ్రంథాలను భావితరాలకు అందించేందుకు వీలుగా వివిధ మార్గాల్లో నిధుల సమీకరణకు ఉన్న అవకాశాలు వినియోగించుకునేందుకు అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.