విశాఖపట్నం

ముస్లింల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సమాచార, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. నగరంలోని కోటవీధి షాదీఖానాలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అర్హులైన ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా కింద నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.710 కేటాయించామన్నారు. అలాగే ముస్లిం విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం కోసం రూ.84.7 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నిరుపేద ముస్లిం యువతుల వివాహం నిమిత్తం దుల్హన్ పథకం కింద 10వేల మందికి ఒక్కొక్కరికి రూ.50వేలు మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే దుకాన్, మకాన్ పేరిట అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, ఉపాధి కోసం వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ముస్లిం విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. ముస్లిం ప్రార్ధనాలయాలైన మసీదుల మరమ్మతులు, వౌలిక సదుపాయాల కల్పనకు రూ.3.5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వక్ఫ్‌బోర్టులకు చెందిన విలువైన భూములను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ తరపున గట్టివాదనలు విన్పిస్తామన్నారు. అంతకు ముందు మంత్రి రఘునాధ రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. కార్యక్రమానికి సారధ్యం వహించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ ముస్లిం సంక్షేమంపై దృష్టి సారించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ విభాగం ప్రతినిధి నజీర్, షాధీఖానా చైర్మన్ మహ్మద్ అనీఫ్, డిఎస్‌ఓ నిర్మలాబాయి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ నజీర్ పాల్గొన్నారు.