విశాఖపట్నం

విశాఖలో ఆటోనగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న విశాఖలో ఆటోనగర్ అవసరాన్ని గుర్తించారు. స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖలో మోటారు వాహనాల మరమ్మతులు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రాంతం ఉండాలని ఆయా వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఈ మేరకు నగర శివార్లలో ఆటోనగర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన చేసింది. పారిశ్రామికంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న విశాఖలో ఆటోమోబైల్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నిత్యం వేలాది సరుకు రవాణా వాహనాలు సంచరించే విశాఖలో ప్రత్యేక ఆటోనగర్ నిర్మాణానికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ రంగాన్ని నమ్ముకుని సుమారు 1000 కుటుంబాలు ప్రత్యక్షంగాను, మరో 10వేల కుటుంబాలు పరోక్షంగాను జీవిస్తున్నాయి. ఆటోమోబైల్ రంగంలో విజయవాడ తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన విశాఖలో ప్రత్యేకించి ఆటోనగర్ లేకపోవడం ఒక విధంగా దురదృష్టకరమే. ఇప్పటికీ నగరంలోని జ్ఞానాపురం, రామకృష్ణ ధియేటర్, 80 ఫీట్ రోడ్డు, గాజువాక ప్రాంతాల్లోనే మోటారు వాహనాల మరమ్మతుల షెడ్లతో పాటు, విడి భాగాల విక్రయించే దుకాణాలు ఉన్నాయి. ఈ రంగానికి ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ, ఇతర ఇబ్బందులకు తెరదించాల్సిన అవసరాన్ని ఎట్టకేలకు గుర్తించారు. ఆటోవర్కర్ల యూనియన్ విజ్ఞాపన మేరకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆటోనగర్‌కు స్థలాన్ని కేటాయించాల్సిందిగా కలెక్టర్ యువరాజ్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్యే విజ్ఞాపనపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఎపిఐఐసికి నివేదించారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన ఎపిఐఐసి ఆనందపురం మండలం కణమాం సమీపంలో 150 ఎకరాలను గుర్తించింది. అనకాపల్లి నుంచి ఆనందపురం మార్గం భవిష్యత్‌లో ఆరు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి కానుంది. ఈ రహదారిని ఆనుకుని కణమాం గ్రామంలో ఆటో నగర్ నెలకొల్పితే అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని భావించారు. ఇక్కడ సుమారు 150 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేయడం ద్వారా 11వేల కుటుంబాలకు మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 23న విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు ద్వారా ఆటోనగర్ ఏర్పాటు అంశాన్ని ప్రకటించాలని నిర్ణయించారు.