విశాఖపట్నం

ఐఐపిఎం తరలింపును సత్వరమే నిలిపివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 4: విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) తరలింపును ఆపాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. యల్లమ్మతోట పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీని ఏర్పాటుకు అనకాపల్లిలో భూమి సైతం గుర్తించారన్నారు. ఈ విద్యాసంస్థను కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించడం అన్యాయమన్నారు. విశాఖలో ఇప్పటికే ఐఐఎఫ్‌టి, ఇండియన్ ఇన్‌స్టిటూక్యట్ ఆఫ్ ప్యాకేజింగ్ మేనేజ్‌మెంట్ సం స్థలను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారని గుర్తుచేశారు. వ్యవసాయరంగానికి ఎంతో మేలు చేసే ఇటువంటి విద్యాసంస్థలు తరలించేయడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖ ఎంపీ హరిబాబు ఈ తరలింపుపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ విద్యాసంస్థను విశాఖలో ఏర్పాటు చేసేవరకు పోరాడుతామన్నారు. సిఎం సలహా మేరకు ఇది తరలించారన్నారు. గతంలో హైదరాబాద్‌లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతం అయిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. తమ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. అభివృద్ధి అంతా అన్ని జిల్లాకలు విస్తరించాలన్నదే తమ డిమాండ్‌గా పేర్కొన్నారు.విశాఖలో జరిగిన అంతర్జాతీయ సదస్సు దావరా రూ.4.70లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని ఇప్పటివరకు ఒక్కశాతం పెట్టుబడులు కూడా రానేలేదన్నారు. ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ తైనాల విజయకుమార్ మాట్లాడుతూ విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, జివిఎంసి డిస్పెన్సరీలను ప్రైవేటుపరం చేసే జీవో 42ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సత్తిరామకృష్ణారెడ్డి, రవిరెడ్డి, బర్కత్ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.