విశాఖపట్నం

రుషికొండ బీచ్ అందాలు పరిరక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 4: నగరంలో రుషికొండ బీచ్ తీరాన్ని పరిరక్షించి అందాలను కాపాడతామని, పూర్వస్థితికి వచ్చే విధంగా పునరుద్ధరిస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దీనికోసం రక్షణ గోడ నిర్మించడంతోపాటు బీచ్ సుందరీకరణ పనులు కూడా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేపడతామన్నారు. బీచ్ కొంత మేరకు కోతకు గురికావడంతో ఆ ప్రాంతాన్ని గురువారం జిల్లా అధికారులతో కలసి సందర్శించారు. పర్యాటకశాఖ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీరాములనాయుడు, జివిఎంసి చీఫ్ ఇంజనీర్ చంద్రయ్య తదితరులతో బీచ్ పునరుద్ధరణ పనులపై చర్చించారు. బీచ్‌కు ఆనుకొని ఉన్న దుఖాణాలను ఖాళీ చేయించి మరోచోట వసతి కల్పిస్తామన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంపి థియేటర్ నిర్మించనున్నామని అన్నారు. బీచ్ కోతపై అధ్యయనం జరుగుతుందన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్కు అభివృద్ధి తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసి వీలైనంత త్వరగా బీచ్‌కు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.