విశాఖపట్నం

గెయిల్ గ్యాస్‌ను అందుబాటులోకి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 4: గృహ వినియోగదారులకు వీలైనంత త్వరితగతిన గెయిల్ ద్వారా వంట గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి గెయిల్‌తో ప్రభుత్వం జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేయడం స్వాగతిస్తున్న అంశంగా ఆయన పేర్కొన్నారు. అయితే ఇంటింటికి వంట గ్యాస్‌ను సరఫరా చేసే చర్యలు మరింత వేగవంతం కావాల్సి ఉందన్నారు. నాలుగేళ్ళ కిందట తాను శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు పార్లమెంటరీ స్థాయి సంఘ చైర్మన్‌గా ఉన్నపుడు గెయిల్ అధికారులతో సంప్రదింపులు జరిపానన్నారు. కాకినాడ-శ్రీకాకుళం ప్రాంతాల మధ్య పైపులైను నిర్మాణం ద్వారా వంట గ్యాస్‌ను సరఫరాను చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విధంగా పైపులైన్ నిర్మాణం జరిగిన తరువాత వంట గ్యాస్‌ను కోరుకున్న వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురాగలమంటూ ఇచ్చిన హామీ మేరకు ఇపుడు చర్యలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.