విశాఖపట్నం

ప్రతి గురువారం గ్రామాల్లో తిరగాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 4: అధికారులు ప్రతి గురువారం గ్రామాల్లో తిరగాల్సిందేనని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు పర్యటన ఏర్పాట్లపై గురువారం సమీక్షించిన కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను మరింత మెరుగైనరీతిలో క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో భాగంగా పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటించడం ద్వారా ఆయా కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా, మెరుగ్గా అమలు చేయవచ్చనే లక్ష్యంతో నోడల్ అధికారుల వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు. మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి వీరు బాధ్యత వహిస్తూ మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరుస్తూ, అనుసంధానం చేస్తూ జిల్లా యంత్రాంగానికి, మండల స్థాయికి వీరు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. జిల్లా యంత్రాంగానికి ఎప్పటికపుడు క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదిస్తారు. వారు అందించే నివేదికలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆయా మండలాల్లో సమస్యల పరిష్కారంపై కలెక్టర్, ఇతర జిల్లాస్థాయి అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడతారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ఆయా పథకాల అమలుపై వాస్తవ పరిస్థితులు జిల్లా అధికారులు తెలుసుకోవడంతోపాటు వాటిని సరిదిద్దేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ భావిస్తున్నారు. గ్రామాల్లో పథకాల అమలుపై దృష్టిసారించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇక నుండి గ్రామాల సందర్శన కార్యక్రమాన్ని గతంలో మాదిరిగానే ప్రతి గురువారం నిర్వహించాలన్నారు. దీనికి సంబంధిత మండల నోడల్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించాల్సిందిగా సూచించారు. ఈ వారం వరకు శుక్రవారం నుండి శ్రీకాకరం చుట్టాలని నిర్ణయించారు. వచ్చే వారం నుండి గురువారం నిర్వహించే గ్రామాల సందర్శన కార్యక్రమంలో మండలంలో పనిచేసే, తహశీల్దార్ తదితర అధికారులు హాజరై దీనిని ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలన్నారు. ఒక్కో వారం ఒక్కో గ్రామ పంచాయతీని సందర్శించి ఆ గ్రామంలో జరుగుతున్న పనులు, ప్రభుత్వ పథకాల అమలు పరిశీలించాలన్నారు. గ్రామంలో ప్రభుత్వ సంస్థలను తనిఖీలు కూడా చేయాలన్నారు. గ్రామ సందర్శన కార్యక్రమంపై ఆ మరుసటి రెండు రోజుల్లో జిల్లాస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ఈ పర్యటనల సందర్భంగా వారు గమనించిన అంశాలపై చర్చిస్తామన్నారు. పలు ప్రభుత్వ శాఖల కలిసి పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధించగలమని, అందులో భాగంగానే ఆయా శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అన్ని మండలాల ఎంపిడిఓలు నోడల్ అధికారులకు తమ మండలాల్లో జరుగుతున్న కార్యక్రమాలను వివరించాలన్నారు. గ్రామాలు సందిర్శించేటపుడు ఆయా గ్రామంలో కనీసం మూడు గంటలు గడిపి, ఆయా పథకాల అమలుపై సంబంధిత వర్గాలతో మాట్లాడాలని సూచించారు. స్వచ్ఛ్భారత్, మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, రేషన్ సరఫరా, ఫించన్ల పంపిణీ తదితర గ్రామస్థాయిలో జరిగే అన్ని కార్యక్రమాలపై సమగ్రంగా సమాచారాన్ని సేకరించాలన్నారు. ఆయా గ్రామాలను నోడల్ అధికారి బృందం సందర్శించేటపుడు గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి తదితరులకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.