విశాఖపట్నం

ప్రత్యక్ష పరిజ్ఞానమే మేలు : విసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 4: ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా కృషి చేయాలని ఎయు ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎయు వృక్షశాస్త్ర విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వర్సిటీని సుందరంగా తీర్చిదిద్దడంలో విద్యార్థుల భాగస్వామ్యం అవసరమన్నారు వర్సిటీలో ప్రవేశ మార్గాలు, ప్రధాన కూడళ్ళ వద్ద పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు మంచి ఆలోచనలతో వస్తే వర్సిటీ సుందరీకరణలో విద్యార్థుల సూచనలు స్వీకరించడం జరుగుతుందన్నారు. విభాగాల ఆధునీకరణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వం, ప్రవర్తన వర్సిటీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని గమనించాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సివి రామన్ మాట్లాడుతూ క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలన్నారు. విద్యర్థినులకు అవసరమైన వౌలిక వసతులను అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నామన్నారు. విద్యార్థి సమన్వయాధికారి ఆచార్య అరుంధతి మాట్లాడుతూ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. ప్రతి విద్యార్థి భయాన్ని వీడాలని సూచించారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉంటూ స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. విభాగాధిపతి ఆచార్య వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రీయ సంస్థలతో విభిన్న అంశాల్లో సంయుక్తంగా పని చేస్తున్నామన్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డులను అందిస్తున్నామన్నారు. బిఓఎస్ చైర్మన్ ఆచార్య ఓ.అనీల్‌కుమార్ మాట్లాడుతూ సంపూర్ణ జ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా విద్యార్ధులు పనిచేయాలన్నారు. నూతన పరిసరాలకు అలవాటు పడాలన్నారు, నిబద్ధత కలిగి అధ్యాపక బృందం సేవలను పూర్తిస్థాయిలో విద్యార్ధులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విభాగ అచార్యులు, పరిశోధకులు, విద్యార్ధులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రదానం చేశారు.