విశాఖపట్నం

టిడిపిలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. దొరబాబు చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో పని చేశారు. గత జివిఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. మేయర్ పదవిని ఆశించిన దొరబాబు అందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారు. చివరి నిముషంలో మేయర్ పదవిని బిసికి ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ పదవి పులుసు జనార్దనరావుకు దక్కింది. దీంతో దొరబాబు డిప్యూటీ చైర్మన్ పదవితో సరిపెట్టుకున్నారు. దొరబాబు చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన అనుచరులతో చర్చించిన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని సిఎం తాత్కాలిక నివాస గృహంలో చంద్రబాబు సమక్షంలో దొరబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా దొరబాబు చెప్పారు.