విశాఖపట్నం

స్మార్ట్ ఎయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 4: ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని స్మార్ట్ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతున్నామని ఎయు ఉప కులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం ఎయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన ‘యుఎస్ డెలిగేషన్ ఆన్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐటి ట్రెండ్స్’ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ప్రాజెక్ట్స్ నిర్వహణ దిశగా పని చేస్తున్నామన్నారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు నోడల్ వ్యవస్థగా ఎయు నిలుస్తుందన్నారు. వైఫై, ఇంటర్నెట్ వంటి వసతులతో ఎయు స్మార్ట్ క్యాంపస్ దిశగా నడుస్తోందన్నారు. ఇప్పటికే వర్సిటీలో పరీక్షల విభాగానికి సంబంధించిన రికార్డులను డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. వర్సిటీలో నాటే మొక్కలకు జియో ట్యాగింగ్ చేసే అవకాశం ఉందన్నారు. ఎస్‌టిపిఐ జాయింట్ డైరెక్టర్ ఎంపి దుబే మాట్లాడుతూ స్థానికంగా స్థాపించే సంస్థలకు మేలైన మానవ వనరులు స్థానికంగా లభిస్తున్నాయన్నారు. అమెరికాకు చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ బ్యూరో డిప్యూటి చీఫ్ నీసి గుండిల్స్‌బెర్గర్ మాట్లాడుతూ భవిష్యత్ సాంకేతిక ఆవిష్కరణల యువతరం చేతిలో రూపుదిద్దుకుంటాయన్నారు. సాంకేతికత మన జీవితాల్లో ప్రతీ దశను ప్రభావతి చేస్తోందన్నారు. రైతులు విక్రయించే వస్తువుల నుంచి అన్ని వ్యాపారాల వరకు టెక్నాలజీ ప్రభావితంగా సాగుతోందన్నారు. రవాణా సంబంధ యాప్‌లను తయారు చేయాలన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ ఆఫీసర్స్ అండ్ అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ టేలర్ మాట్లాడుతూ వేగవంతమైన, అందుబాటులో ఉన్న సాంకేతిక గ్రామీణ ప్రాంతాలకు చేరాల్సి ఉందన్నారు. ఆలోచనలను, సాంకేతికతను అనుసంధానించి పనిచేయడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియగా నిలుస్తోందన్నారు. సాంకేతిక విస్పోటనాన్ని యువతరం సద్వినియోగం చేసుకోవడం అవసరమన్నారు. నేషనల్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్ బాండ్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఐమిమిచాచ్ మాట్లాడుతూ భారత్‌లో విద్యార్ధినుల సంఖ్య అధికంగా ఉండటం మంచి పరిణామన్నారు. పాలనాపరంగా నిర్ణయాలు తీసుకునే వారికి సాంకేతికపరమైన పరిష్కారాలను చూపాలన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఆవిష్కరణల ప్రధానంగా సమాజం అభివృద్ధి జరుగుతోందన్నారు. విద్యార్ధులను మానవ వనరులు మార్పు చేయడానికి పనిచేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పిఎస్ అవధాని మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాల ప్రగతిని వివరించారు. పాలకమండలి సభ్యులు ఎం.ప్రసాదరావు, సిఐఐ విశాఖ జోనల్ కౌన్సిల్ చై ర్మన్ డాక్టర్ వి.మురళీకృష్ణలు ప్రసంగించారు. సదస్సు కన్వీనర్ ఆచార్య కె.వెంకటరావు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధులను సత్కరించారు.