విశాఖపట్నం

పనుల ప్రగతిని నివేదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 4: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అరకు, పెదలబుడు గ్రామాల్లో పర్యటించనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు ఖరారైన తాత్కాలిక పర్యటన కార్యక్రమం ప్రకారం ముఖ్యమంత్రి తాను దత్తత తీసుకున్న గిరిజన గ్రామం పెదలబుడు సందర్శించే అవకాశం ఉందని, అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకుల్లో పాల్గొంటారన్నారు. ఉదయం 11.30 గంటలకు చేరుకుని మధ్యాహ్నం వరకు అక్కడ ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రభుత్వ శాఖలన్నీ తాము ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన, చేపట్టనున్న కార్యక్రమాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. పెదలబుడు గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై కూడా నివేదించాలని చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, ఉద్యానవనాల పెంపకం తదితర శాఖల అధికారులంతా పెదలబుడు గ్రామాన్ని శుక్రవారం సందర్శించి ఆ గ్రామంలో తమ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకుని ఆయా గ్రామాల్లో ప్రజల అవసరాలకనుగుణంగా నివేదించాలన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో తాగునీటి సరఫరా, రోడ్డు సౌకర్యం, తదితర అంశాలపై సంబంధితాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఏజేన్సీలో తాగునీటి పరిస్థితిపై గతంలో సర్వే నిర్వహించామని, ఎటువంటి తాగునీటి వనరులు లేని గ్రామాలు, నివాసిత ప్రాంతాలు 332 ఉన్నట్టు గుర్తించామని, వీటితోపాటు పాక్షికంగా నీటి సరఫరా గల గ్రామాలకు కలిపి రూ.222 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు గ్రామీణ నీటిసరఫరా పర్యవేక్షక ఇంజనీర్ తోట ప్రభాకరరావు చెప్పారు, పెదలబుడు గ్రామానికి తాగునీటి సరఫరాకు ఐదు కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. రోడ్డు సౌకర్యంలేని 2471 గ్రామాలకు రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు సమర్పించగా ఈ ఏడాది 368 గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ఎం.గజేంద్ర తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని పెండింగ్ సమస్యలపై ఆయా శాఖలన్నీ నివేదికలు అందించాలన్నారు. సమావేశంలో జెసి-2 డి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.