విశాఖపట్నం

గ్రీన్ క్లీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 28: నగరంలో పచ్చదనం పరిరక్షణలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోంది. హుదూద్ తుపాను అనంతరం మోడులా మారిన నగరాన్ని తిరిగి పచ్చదనంతో నింపాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పలు అవాంతరాలు తప్పట్లేదు. గత రెండేళ్ల కాలంలో నగర పరిధిలో మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి)తో పాటు పలు ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు లక్షలాది మొక్కలు నాటారు. ఒక్క జివిఎంసి ఆధ్వర్యంలోనే 78వేల మొక్కలు నాటారు. రెండేళ్లుగా ఉద్యమం మాదిరి కొనసాగుతున్న మొక్కల పెంపకం ఇప్పుడు నీరుగారుతోంది. నగరంలో ఏపుగా పెరిగిన పచ్చటి మొక్కలను కొన్ని ప్రభుత్వ సంస్థలు నిర్ధాక్షిణ్యంగా నరికేస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పనులకు అడ్డంకిగా మారిన మొక్కలను ఎవరి అనుమతి లేకుండానే నరికేస్తోంది. గత కొంతకాలంగా ఈ పచ్చ విధ్వంసం చోటుచేసుకుంటోంది. మొక్కలు పెంచేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న సంస్థలు, ఇప్పుడు వాటిని సంరక్షించే విషయంలో మాత్రం నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా నగరంలోని డాక్టర్స్ కాలనీ, వాల్తేరు, ఎంవిపిలోని పలు సెక్టార్లలో చెట్ల నరికివేత యధేచ్ఛగా సాగుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు అడ్డంకిగా ఉన్న చెట్లను మోడుల్లా మార్చేస్తున్నారు. అయితే విద్యుత్ సంస్థలు తమ తీరును సమర్ధించుకుంటున్నాయి. వైర్లకు అడ్డంకిగా ఉన్న చెట్లను తొలగించని పక్షంలో సరఫరాకు అంతరాయమేర్పడుతుందని అంటున్నారు. అయితే దీనికి భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని అంటున్నారు.