మీకు తెలుసా ?

పుట్టినప్పుడు చిక్కుడు గింజంత ఉంటాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాటిపస్ పేరు అందరికీ తెలిసిందే. టాస్మేనియా, తూర్పు ఆస్ట్రేలియాల్లో కన్పించే ఇవి బాతు, ఒట్టర్, బీవర్ జంతువుల పోలికలతో ఉంటాయి. బాతులాంటి ముక్కు, కాళ్లు, బీవర్‌లా తోక, ఒట్టర్‌లా శరీరం వీటి ప్రత్యేకత. ముందుకాళ్లతో ఈదుతూ, తోకను స్టీరింగ్‌లా ఉపయోగించడం వీటి ప్రత్యేకత. వీటి వెనకకాళ్ల కింద ఉండే ముళ్లవంటి భాగంతో శత్రువులను కాటువేయడం వీటికి ఉన్న రక్షణ వ్యవస్థలో ఓ చర్య. కుక్క స్థాయి జంతువులైతే వీటి కాటుకు మరణిస్తాయి. మనిషికూడా స్పృహతప్పి పడిపోయేంత ప్రభావం వీటి విషానికి ఉంది. అందువల్ల ప్లాటిపస్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఇది ఉభయచర క్షీరదం. నీటిలో డైవ్ చేసినపుడు కళ్లు, చెవులు, ముక్కు మూసుకునే ప్లాటిపస్ ఆహారాన్ని మాత్రం గుర్తించగలుగుతుంది. అన్నట్లు వీటి పిల్లలు చిక్కుడు గింజంత మాత్రమే ఉంటాయి. కొన్ని నెలలపాటు తల్లి సంరక్షణలోనే ఉంటాయి. వీటి బొరియల్లో వచ్చిపోయేందుకు రెండురెండు మార్గాలను ఇవి నిర్మించుకుంటాయి. సంతానోత్పత్తి సమయంలో ప్రత్యేకమైన బొరియలు నిర్మించుకుంటాయి.

ఎస్.కె.కె.రవళి