అంతర్జాతీయం

ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ-షరీఫ్ భేటీపై అమెరికా, ఐరాస హర్షం

వాషింగ్టన్, డిసెంబర్ 26: భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఆకస్మిక పర్యటనను అమెరికా, ఐక్యరాజ్య సమితి స్వాగతిస్తూ, ఈ దాయాది దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడం వల్ల మొత్తం ఉపఖండానికే మేలు జరుగుతుందని అభిప్రాయ పడ్డాయి. డిసెంబర్ 25న భారత ప్రధాని మోదీ, పాక్‌ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సమావేశాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ పొరుగుదేశాల మధ్య మెరుగైన సంబంధాలు ఈ మొత్తం ప్రాంత ప్రజలకే మేలు చేస్తాయి’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి కిర్బీ శనివారం విలేఖరులు అడిగిన ఒక అపశ్నకు సమాధానంగా చెప్పారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ సైతం ఈ ఇరువురు నేతల మధ్య సమావేశాన్ని స్వాగతిస్తూ ద్వైపాక్షిక చర్చలు ఇదే విధంగా కొనసాగి మరింత బలపడి ముందుకు సాగుతాయన్న ఆకాంక్షను వ్యక్తం చేసారు. ‘్భరత్, పాకిస్తాన్ దేశాల నేతల మధ్య చర్చలను ఐరాస ప్రధాన కార్యదర్శి దీర్ఘకాలంగా ప్రోత్సహిస్తున్నారు. మోదీ పర్యటనను ఆయన స్వాగతిస్తున్నారని, ఇది సరయిన దిశగా వేసిన అడుగని భావిస్తున్నారు.ఈ చర్చలను ఇలాగే కొనసాగిస్తారని, మరింత బలోపేతమై ముందుకు సాగుతాయని ఆయన ఆశిస్తున్నారని ఐరాస ప్రతినిధి ఒకరు చెప్పారు.
కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ ఆకస్మిక పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చెప్పుకొద్గ పరిణామమని అమెరికా మీడియా అభిప్రాయ పడుతూ, సతబ్దుగా మారిన ఇరు దేశాల సంబంధాలకు ఇది కొత్తఊపునిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సాధారణంగా వేడుకలకే పరిమితమయ్యే క్రిస్మస్ రోజున సైతం అమెరికాకు చెందిన పలువురు ప్రముఖ విశే్లషకులు, విద్యావేత్తలు మోదీ లాహోర్ పర్యటనపై సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందించారు.
స్వాగతించిన పాక్ ప్రతిపక్షాలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ ఆకస్మిక పర్యటనను పాక్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు స్వాగతిస్తూ, ఇరు దఏశాల సంబంధాల్లో ఇది కొత్త ఆరంభమని, ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపడడానికి దోహదపడుతుందని అభిప్రాయ పడ్డాయి.మోదీ పర్యటనను తమ పార్టీ సమర్థిస్తుందని పార్లమెంటులో ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు సయ్యద్ ఖుర్షీద్ షా అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి నిరంతర చర్చలే మార్గమని పిపిపి చైర్‌పర్సన్ బిల్వాల్ భుట్టో జర్దారీ అన్నారు.