కృష్ణ

రాజధాని నిర్మాణానికి ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణానికి ప్రపంచ స్థాయి ఆర్కిటెక్కుల ఎంపికకు ఏపి సిఆర్‌డిఎ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటుచేసిన రెండురోజుల వర్క్‌షాప్‌ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వర్క్‌షాప్‌లో ఏపి సిఆర్‌డిఎ కార్యదర్శి అజయ్‌జైన్, ఎపి సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ నాగులాపల్లి, ఇతర ఉన్నతాధికారులతో పాటు రెండు అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ బృందాలు పాల్గొన్నాయి. ప్రజా రాజధాని అమరావతిలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు భవనాలు ప్రపంచ స్థాయిలో అత్యుత్తమంగా నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులకు ఎపి సిఆర్‌డిఎ కార్యదర్శి అజయ్‌జైన్ వివరించారు. విజన్ అప్రోచ్‌తో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడం గొప్ప అవకాశమన్నారు.
ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణంలో అత్యాధునిక డిజైన్లు, నిర్ణీత సమయం, పరిమిత వ్యయం ప్రధానంగా తమ ప్రాధాన్యతా అంశాలని కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ప్రపంచ స్థాయి ఆర్కిటెక్టులు ప్రపంచ వ్యాప్తంగా తాము రూపొందించిన భవనాల డిజైన్లను వర్క్‌షాప్‌లో ప్రదర్శించారు. ప్రపంచ స్థాయి ఆర్కిటెక్టుల నైపుణ్యంపై తమకు ఎలాంటి సందేహం లేదని, అయితే ఆర్థిక అంశాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణంలో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అజయ్ జైన్ చెప్పారు. ప్రతిపాదిత ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణ అనుమతులన్నీ సత్వరమే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎపి సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. వర్క్‌షాప్‌లో సిఆర్‌డిఎ అధికారులు ప్రతిపాదిత ప్రజా రాజధాని బృహత్ ప్రణాళికను ఆర్కిటెక్ట్ నిపుణులకు వివరించారు. అనంతరం ఆర్కిటెక్ట్ నిపుణులు, అధికారులు ప్రతిపాదిత రాజధాని నగర ప్రాంతంలో పర్యటించారు.