S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/14/2017 - 21:04

మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జి.వి.ప్రకాష్‌కుమార్ నటించిన తమిళ చిత్రం ‘బ్రూస్ లీ’. తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా అనువాద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని నిర్మాత తెలిపారు. యశ్వంత్ మూవీస్ పతాకంపై డి.వెంకటేష్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది.

07/14/2017 - 21:02

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘దర్శకుడు’. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బిఎన్‌సిఎస్‌పి విజయకుమార్, థామస్ రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

07/14/2017 - 21:00

జె.జాన్‌బాబు దర్శకత్వంలో పి.డి.రాజు, జీవన్ ప్రధాన తారాగణంగా సువర్ణ క్రియేషన్స్ పతాకంపై టి.సుధాకర్ నిర్మించిన చిత్రం తొలికిరణం. యేసు ప్రభువు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. ఆడియో ఇటీవల విడుదలైన మంచి ఆదరణ పొందిన సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో శుక్రవారం ఉదయం ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు.

07/14/2017 - 20:59

శ్రీకాంత్ కథానాయకుడిగా వి.జి.చెర్రీస్ విజన్స్ పతాకంపై విజయ్ రూపొందించిన చిత్రం ‘రారా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెలలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ గీతాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో శ్రీకాంత్‌తోపాటు సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, గాయని వౌష్ణినేహా, విజయ్ పాల్గొన్నారు.

07/14/2017 - 20:57

వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాజు, శిరీష్ రూపొందించిన చిత్రం ‘్ఫదా’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది.

07/14/2017 - 20:57

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై దుమ్ము రేపుతోంది. ఇందులో జై పాత్రలో ఎన్టీఆర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జై పాత్రలో నత్తితో చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. రావణుని తలపించే నెగెటివ్ పాత్రలో అదరగొట్టిన ఎన్టీఆర్ మిగతా రెండు పాత్రల్లో ఎలా నటించాడో? అన్న ఆసక్తిని క్రియేట్ చేశాడు.

07/14/2017 - 20:55

శ్రీనాధ్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ ఆర్పీ, రచన స్మిత్, రుచి ప్రధాన పాత్రలో ఎ.వి.రమణమూర్తి సమర్పణలో వి.రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ఫిలింస్ పతాకంపై ఎస్.సరిత నిర్మిస్తున్న చిత్రం ‘ఇదేం దెయ్యం’. ‘ముగ్గురు అమ్మాయిలతో’ అనేది ఉపశీర్షిక. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 4న విడుదలకు సిద్ధం అయింది.

07/14/2017 - 20:54

తనీష్, శ్రుతి యుగళ్ జంటగా దేశాయ్ ఆర్ట్స్ పతాకంపై దేశాల లక్ష్మయ్య, మహేందర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ప్రేమిక’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేందర్ మాట్లాడుతూ, ఒక గ్రామంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించామన్నారు.

07/14/2017 - 20:53

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ రూపొందించిన దండుపాళ్య కన్నడ చిత్రం ఈనెల 14న విడుదలై సెనే్సషన్ సృష్టిస్తోందని దర్శకుడు తెలిపారు. తెలుగులో కూడా అంతే హిట్ కానున్నదని, భారీ ఓపెనింగ్స్ కన్నడంలో విజయం సాధించిందని అన్నారు. ఈ చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్ధమవుతోంది.

07/14/2017 - 20:51

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ సోనమ్ కపూర్ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్ దక్కలేదు. దాంతో అటు మ్యాగజైన్‌ల కోసం హాట్ హాట్‌గా అందాలు ఆరబోసినా అడపా దడపా అవకాశాలు వరించాయి తప్ప విజయం రాలేదు. ఇక సినిమా ప్రయత్నాలు మానుకుందో ఏమో ఆనీ.. ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయిందట. కొంతకాలంగా బిజినెస్‌మెన్ ఆనంద్ ఆహుజాతో ఆమె ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

Pages