S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/12/2016 - 23:14

అల్లు అర్జున్ తాజాగా ‘సరైనోడు’ చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం డి.జె’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ న్యూలుక్‌లో కన్పిస్తాడని తెలిసింది. త్వరలోనే ఈ లుక్‌కు సంబంధించిన స్టిల్ విడుదల చేస్తారట.

11/12/2016 - 23:10

‘సత్యహరిశ్చంద్ర’ పద్య నాటకం నాటినుంచి నేటివరకూ అందరినీ అలరిస్తూనే వుంటుంది. ఈ నాటకం తాజాగా అదే పేరుతో సినిమాగా రూపొందింది. ప్రముఖ రంగస్థల నటి మంగాదేవి ఇందులో సత్యహరిశ్చంద్ర పాత్రలో నటించడం విశేషం. మోరల్ ప్రొడక్షన్స్ పతాకంపై రంగస్థల నటుడు వై.గోపాలరావు దర్శకత్వం వహించగా కొత్తపల్లి సీతారాము నిర్మించారు.

11/12/2016 - 00:23

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ట్రేడ్ వర్గాలతోపాటు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈచిత్రంలోని పాటలను తిరుపతిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల కానుంది. అదే నెల 16న పాటలను విడుదల చేస్తారట.

11/12/2016 - 00:22

ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అందాల భామ త్రిష సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. లేటెస్ట్‌గా ఆమె నటించిన కోడి (్ధర్మయోగి) చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు, ఇందులో నెగెటివ్ రోల్‌లో కనిపించి, మంచి మార్కులు కొట్టేసింది. విభిన్నమైన పాత్రలతోపాటు గ్లామర్‌ను పండిస్తూ తన సత్తా చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్న ఈమె తాజాగా సతురంగ వెట్టై-2 చిత్రంలో నటిస్తోంది.

11/12/2016 - 00:21

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ధృవ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. హిప్‌హాప్ ఆది సంగీతం అందించిన ఈ పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా విడుదలైన ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.

11/12/2016 - 00:19

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా భారీ హైప్‌తో వచ్చిన కబాలి చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు రజనీ. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు రజనీ.

11/12/2016 - 00:19

తెలుగు తెరపై తనదైన ప్రత్యేకతను చాటుకున్న అనుష్క ఓవైపు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకుంటూనే మరోవైపు నటనకు ఆస్కారం వున్న పాత్రలతో మెప్పిస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో ఆమె నటనను మర్చిపోలేం. దేవసేనగా ‘బాహుబలి’లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటికే దశాబ్దానికి పైగా హీరోయిన్‌గా వెలిగిన ఈమె త్వరలో పెళ్లిచేసుకునేందుకు సిద్ధమైందట. ఆమె కుటుంబ సభ్యులు వరుడ్ని వెతికే పనిలో పడ్డారు.

11/12/2016 - 00:16

చందన్‌కుమార్, సంగీత చౌహాన్ జంటగా నవీన్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘లవ్ యు అలియా’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చిత్రం గురించి దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ, ‘అందర్నీ ఆకట్టుకునే చక్కని ప్రేమకథా చిత్రమిది.

11/12/2016 - 00:15

ఉదయ్, చంద్రకళ, సన్నీ, సునంద నటిస్తున్న శ్రీ సాయిలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘4జి’. శ్రీనివాస్ కరణం దర్శకుడు. కె.వి.వినోద్‌రెడ్డి నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రేమలో ఉన్న నలుగురు యువత ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరికి ప్రేమ ఎటువంటి పరిణామాలకు దారితీసింది అనేది కథ.

11/12/2016 - 00:14

విజయ్ దేవరకొండ, పూజా ఝవేరీ జంటగా శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న, గణేష్ నిర్మిస్తున్న చిత్రం ద్వారక. ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ పూజా ఝవేరి చెప్పిన విశేషాలు...

Pages