క్రీడాభూమి

కోహ్లీ ఫిట్నెస్‌పై రెండో వారంలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించాల్సిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్‌పై ఈనెల రెండో వారంలో నిర్ణయం తీసుకుంటారు. ఆతర్వాతే, అతను ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడే విషయాన్ని ఖాయం చేస్తారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్ల ఫిట్నెస్‌పై వివరాలను ప్రకటించే క్రమంలో కోహ్లీ భుజం గాయం గురించి ప్రస్తావించింది. రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ అతని కుడి భుజానికి గాయమైందని, త్వరలోనే పునరావాస కేంద్రంలో సాధన చేస్తాడని బిసిసిఐ ఆ ప్రకటనలో వివరించింది. రెండో వారంలో ఫిట్నెస్ పరీక్ష పూర్తి చేసిన తర్వాతే, అతను ఎప్పటి నుంచి ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడవచ్చనేది తేలుతుందని పేర్కొంది. కాగా, భారత జట్టులోని కొంత మంది కీలక ఆటగాళ్లు ఈసారి ఐపిఎల్‌కు దూరమయ్యారు లేదా కనీసం కొన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కోల్పోయారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్, మురళీ విజయ్ ఈసారి ఐపిఎల్‌కు దూరమయ్యారు. కోహ్లీ, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. గాయాల సమస్య ఆటగాళ్లను వేధిస్తుంటే, భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకొని బిసిసిఐ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. గాయాలను పక్కకుపెట్టి ఐపిఎల్‌లో ఆడడం, ఆతర్వాత తమతమ జాతీయ జట్ల సేవలకు అందుబాటులో లేకపోవడం చాలా మంది క్రికెటర్లకు అలవాటుగా మారింది. పలు క్రికెట్ బోర్డులు ఈ తీరును తప్పుపడుతున్నారు. ఐపిఎల్‌పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నదన్న విషయాన్ని గుర్తించిన బిసిసిఐ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. ఫిట్నెస్ లేని ఆటగాళ్లను హడావుడిగా ఐపిఎల్‌లో దించకుండా జాగ్త్ర పడుతున్నది.