రాశిఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
కృష్ణ చతుర్దశి రా.09.03
నక్షత్రం: 
రేవతి రా.09.50
వర్జ్యం: 
ప.10.55 ల 12.22
దుర్ముహూర్తం: 
ప.08.28 ల 09.18, రా.11.05 ల 11.51
రాహు కాలం: 
............
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు.. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యల నెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్ర్తిల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుదురు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్ని విధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనవసర ధనవ్యయంతో ఋణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
Date: 
Tuesday, April 25, 2017
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి