క్రీడాభూమి

ఇంగ్లాండ్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 1: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు బోణీ చేసింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బార్ శతకంతో విజృంభించగా, మిడిలార్డర్‌లో వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీమ్ అర్ధ శతకంతో రాణించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 305 పరుగుల స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జాసన్ రాయ్ విఫలమైనప్పటికీ ఆండ్రూ హాలెస్, జో రూట్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాట్ ఝళిపించి బంగ్లాదేశ్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. దీంతో 47.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 308 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన జో రూట్ (133 నాటౌట్) ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ క్రీజ్‌లో పాతుకుపోయి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. సౌమ్య సర్కార్ (28)తో కలసి తొలి వికెట్‌కు 56 పరుగులు, ఇమ్రుల్ కరుూస్ (19)తో కలసి రెండో వికెట్‌కు 39 పరుగులు, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (79)తో కలసి మూడో వికెట్‌కు మరో 166 పరుగులు జోడించిన తమీమ్ 142 బంతుల్లో 128 పరుగులు సాధించి నిష్క్రమించాడు. అనంతరం షకీబ్ అల్ హసన్ 10 పరుగులు, సబ్బీర్ రహ్మాన్ 24 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరగా, మహ్మదుల్లా (6), మొసద్దెక్ హుస్సేన్ (2) అజేయంగా నిలిచారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 305 పరుగుల స్కోరు సాధించింది.
అనంతరం 306 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 6 పరుగుల స్కోరుకే ఓపెనర్ జాసన్ రాయ్ (1) వికెట్‌ను కోల్పోయింది. అయితే అలెక్స్ హాలెస్, జో రూట్ క్రీజ్‌లో నిలదొక్కుకుని బంగ్లాదేశ్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చక్కటి సమన్వయంతో స్థిమితంగా ఆడిన వీరు రెండో వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం హాలెస్ (95) నిష్క్రమించినప్పటికీ జో రూట్ (129 బంతుల్లో 133 పరుగులు), ఇయాన్ మోర్గాన్ (61 బంతుల్లో 75 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 47.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 308 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు మరో 16 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
చిత్రం: జో రూట్ 133-నాటౌట్