అంతర్జాతీయం

ట్రంప్ పెద్ద పొరబాటు చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 2: వాతావరణ మార్పులపై 2015లో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందంనుంచి వైదొలగాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఒప్పందాన్ని తిరగదోడడం సాధ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ అధ్యక్షుడు పావ్లో జెంటిలోని స్పష్టం చేశారు.‘పారిస్‌లో 2015 డిసెంబర్‌లో కన్పించిన ఉత్సాహం తిరుగులేనిదని, పారిస్ ఒప్పందాన్ని తిరగదోడడం సాధ్యం కాదని మేము గట్టిగా నమ్ముతున్నాం.
ఎందుకంటే ఈ ఒప్పందం మన భూగోళానికి, సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు ఎంతో కీలకమైంది’ అని వారు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయంపై జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు మనం మన భూగోళాన్ని కాపాడుకోడానికి గతంలోకన్నా ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది’ అని మెర్కెల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ సీబెర్ట్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.