అంతర్జాతీయం

ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 3: ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమంతో సంబంధం ఉన్న 15 మంది వ్యక్తులు, నాలుగు సంస్థలను ఐక్యరాజ్య సమితి ఆంక్షల బ్లాక్‌లిస్టులో చేర్చే ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లుగా ఉత్తర కొరియాపై మరింత కఠినమైన ఆంక్షలకు సంబంధించిన మరో తీర్మానాన్ని మాత్రం చైనా అడ్డుకొంది. ఉత్తర కొరియా గూఢచార కార్యకలాపాలు, విదేశీ ఇంటెలిజన్స్ సమాచారాన్ని సేకరించే విభాగం చీఫ్‌గా భావిస్తున్న ఒక వ్యక్తితోపాటుగా మొత్తం 15 మంది విదేశాల్లో పర్యటించడంపై ఈ తీర్మానం పూర్తిగా నిషేధం విధిస్తోంది. అయితే ఉత్తర కొరియాపై ఒత్తిడి పెంచడానికి దాని కీలక చమురు సరఫరాలపై సైతం నిషేధం విధించాలని ట్రంప్ ప్రభుత్వం పట్టుబట్టినప్పటికీ భద్రతా మండలి తీర్మానం మాత్రం వాటి జోలికి వెళ్లలేదు.
ఓటింగ్ అనంతరం ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ, ‘ఈ రోజు భద్రతా మండలి ఉత్తర కొరియాకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపిస్తోంది. క్షిపణి పరీక్షలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవనేదే ఆ సందేశం’ అని అన్నారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమానికి చర్చలద్వారా పరిష్కారాన్ని అమెరికా కోరుకొంటోందే తప్ప అక్కడ ప్రభుత్వం మారాలని కోరుకోవడం లేదని ‘అయితే భవిష్యత్తులో ఆ దేశం జరపబోయే కవ్వింపు చర్యలపై స్పందించడానికి అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి’ అని స్పష్టం చేశారు. ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని, దాని అణు, క్షిపణి కార్యక్రమాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయపడే ముఠాల వెన్ను విరిచడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని కూడా హేలీ కోరారు.