తెలంగాణ

ప్రజలకు దండగ.. కెసిఆర్‌కు పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాల పతనానికి సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అడ్డగోలు వాగ్దానాల కొత్త సంస్కృతిని తీసుకుని వచ్చారని ఆయన విమర్శించారు. సోమాజీగుడాలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం క్లబ్ అధ్యక్షుడు రాజవౌలి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు జైపాల్ రెడ్డి సమాధానమిస్తూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు మోదీ చరిత్రలో ఎవరూ చేయలేనన్ని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అధికారంలోకి రాగానే విదేశీ బ్యాంకుల్లో ఉన్న మన భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షల రూపాయల చొప్పున వేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో జాతీయ ఉత్పత్తి ఒక్క శాతం తగ్గిందని కేంద్రమే అంగీకరించిందని, నిజానికి అంత కంటే ఎక్కువే తగ్గిందన్నారు. ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. అయోధ్యలో రామాలయం కడతామంటున్నారని, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ రైతులకు లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎపి సిఎం తమకు సచివాలయం లేదని బాధ పడుతుంటే, ఇక్కడ కెసిఆర్ మాత్రం ఉన్నదాన్ని వదులుకుని మరో చోట కడతామంటున్నారని అన్నారు. కొత్త భవనాల నిర్మాణం ప్రజలకు దండగ అయితే కెసిఆర్‌కు పండగ అని ఆయన విమర్శించారు. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనతో రెవెన్యూ మిగులు ఉండేదని, విభజన సమయంలో తెలంగాణకే 54 శాతం రెవెన్యూ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో కెసిఆర్ దిగిపోతారని, ఆ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఇంత అప్పుల భారం రాష్ట్రంపై వేశాడని అనుకుంటారని అన్నారు. రెండు పడకల గదుల ఇండ్లు పూర్తి కావడం పగటి కలే అవుతుందని ఆయన తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టిలకు 3ఎకరాల భూమి ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌కు ఒక్కడే నాయకుడు ఉన్నాడని, తమ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారని చెప్పారు. కెసిఆర్ సర్వే తప్పుల తడక అన్నారు. బిజెపితో సంబంధం లేని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది, ఇప్పటి నుంచే ఆ విషయం ఎందుకని జైపాల్ రెడ్డి దాట వేశారు.