తెలంగాణ

మానవత్వంతో వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: గర్భిణీలు, బాలింతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకునే మహిళలకు ఆర్థిక దన్నునిచ్చే ‘కెసిఆర్ కిట్’ పథకాన్ని ప్రారంభించారు. శనివారం నగరంలోని పెట్ల బుర్జు ఆస్పత్రిలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో సిద్దిపేటలో హరీశ్‌రావు, రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నందునే బెడ్ల సంఖ్యకు మించి పేషంట్లు వస్తున్నారని సిఎం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పెట్ల బుర్జ్ మోడర్న్ మెటర్నిటీ హాస్పటల్‌లో కెసిఆర్ ఆరుగురు బాలింతలకు కిట్లు అందించారు. కెసిఆర్ కిట్స్ వెబ్‌సైట్‌నూ ప్రారంభించారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆస్పత్రిలో అల్ట్రా సౌండ్ సెంటర్, ఎమర్జన్సీ వార్డ్, జనరల్ వార్డ్, స్టెబిలైజేషన్ సెంటర్లను కెసిఆర్ పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది, పేషంట్లతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యంత మానవత్వంతో వైద్య సేవలు అందిస్తున్నట్టు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెంచామన్నారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. పెట్ల బుర్జ్ ఆస్పత్రిలో 462 బెడ్లు ఉంటే, 700 మంది పేషంట్లు వచ్చారని, దీనివల్ల బెడ్ల కొరత ఏర్పడిందన్నారు. అయినాసరే బెడ్లు లేవనే కారణంగా పేషంట్లను పంపించడం లేదని, ఎక్కువమందికి సేవలు అందిస్తున్నందుకు ప్రభుత్వ వైద్యులను అభినందించాలని అన్నారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున పెట్ల బుర్జ్ ఆస్పత్రిలో మరో బ్లాక్ నిర్మిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఇదే ఆస్పత్రిలో గతంలో మహాలక్ష్మి అనే డాక్టర్ గొప్పగా పని చేశారని, ధనవంతులు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునే వారని కెసిఆర్ గుర్తు చేశారు. ఈ ఆస్పత్రి మళ్లీ ఆ స్థాయిలో సేవలు అందించాలని, ఇదే ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడానికి వీలుగా మరో భవనం నిర్మిస్తామన్నారు. గతంలో పేషంట్ల బంధువులు ఉండటానికి వీలుగా ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానంగా ధర్మశాలలు ఉండేవని, మళ్లీ అలాంటి ధర్మశాలలు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. నర్సింగ్ స్ట్ఫాకు స్టయిఫండ్, మెస్ నిర్వాహణ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, సి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఖాద్రీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ శాఖ కమీనర్ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీలకు కెసిఆర్ కిట్లు అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్