తెలంగాణ

భూ స్కాంపై నేడు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణం నిందితుల బెయిల్ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ జరుపనుంది. ఈ స్కాంలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు బెయిల్ కోరుతూ ఇటీవల దాఖలు చేసుకున్న పిటిషన్ కోర్టు కొట్టివేసింది. తాజాగా సోమవారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించనుంది. అదేవిధంగా ఈ కేసు విచారణ కోసం పోలీసులు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరుగనుంది. కాగా ఈ కేసు దర్యాప్తు ముమ్మరం సాగుతోంది. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్’ విధానంతో ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఒక డాక్యుమెంట్ రైటర్‌తోపాటు మరో 12మందిపై కేసులు నమోదు చేశారు.
కార్యాలయాలపై ఏసిబి దాడులు నిర్వహించి అక్రమ రిజిస్ట్రేషన్లపై తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ కేసును తీవ్రనేరంగా పరిగణించిన ప్రభుత్వం రాష్టవ్య్రాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీ చేపట్టింది. 44 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసి, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ఎనివేర్ రిజిస్ట్రేషన్లు కొన్నింటిని రద్దు చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. గోల్డ్‌స్టోన్ సంస్థ చైర్మన్ ప్రసాద్, అతని కుటుంబ సభ్యులకు సంబంధించి అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోంది.