తెలంగాణ

ఒంటరి మహిళలకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు జీవన భృతి చెల్లించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టింది. రాష్టవ్య్రాప్తంగా 119 నియోజకవర్గాల్లో 150 కేంద్రాలు ఏర్పాటు చేసి ఒంటరి మహిళలకు ఫించన్లు అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచే ఒంటరి మహిళలకు ఫించన్లు చెల్లించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడవడంతో ఏప్రిల్, మే రెండు నెలలకు సంబంధించిన ఫించన్ మొత్తాన్ని నేరుగా బ్యాంక్‌లలో జమ చేసి వాటికి సంబంధించిన మంజురు పత్రాలను ఒంటరి మహిళలకు అందజేసింది. రాష్ట్రంలో ఒంటరి మహిళల సంఖ్య సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ 1.44లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,08,302మంది ఈ పథకం ద్వారా ఫించన్లు పొందడానికి అర్హులుగా గుర్తించగా, 35,915 మందిని అనర్హులుగా అధికారులు తేల్చారు. 31 జిల్లాల్లో ఈ మేరకు రెండు నెలల ఫించన్ల మొత్తం రూ. 21.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒంటరి మహిళల పథకం కింద అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి 8367 మంది ఎంపిక కాగా, అత్యల్పంగా నిర్మల్ జిల్లా నుంచి 1277 మందిని ఎంపికయ్యారు. జిల్లాల వారిగా ఒంటరి మహిళల పథకం కింద ఫించన్లు అందుకున్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి 1602 మంది, భద్రాద్రి జిల్లా నుంచి 4742 మంది, హైదరాబాద్ జిల్లా నుంచి 5068 మంది, జగిత్యాల జిల్లా నుంచి 3757 మంది, జనగామ జిల్లా నుంచి 1421 మంది, భూపాల్‌పల్లి జిల్లా నుంచి 2319 మంది, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి 1744 మంది, కామారెడ్డి జిల్లా నుంచి 3522 మంది, కరీంనగర్ జిల్లా నుంచి 2785 మంది, ఖమ్మం జిల్లా నుంచి 6412 మంది, ఆసిఫాబాద్ జిల్లా నుంచి 2435 మంది, మహబూబాబాద్ జిల్లా నుంచి 2578 మంది, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 6333 మంది, మంచిర్యాల జిల్లా నుంచి 2275 మంది, మెదక్ జిల్లా నుంచి 3614 మంది, మేడ్చల్ జిల్లా నుంచి 3925 మంది, నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి 3160 మంది, నల్లగొండ జిల్లా నుంచి 5867 మంది, నిర్మల్ జిల్లా నుంచి 1277 మంది, నిజామాబాద్ జిల్లా నుంచి 8367 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి 1989 మంది, రాజన్న జిల్లా నుంచి 1591 మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 5054 మంది, సంగారెడ్డి జిల్లా నుంచి 5167 మంది, సిద్దిపేట జిల్లా నుంచి 2975 మంది, సూర్యాపేట జిల్లా నుంచి 5093 మంది, వికారాబాద్ జిల్లా నుంచి 4260 మంది, వనపర్తి జిల్లా నుంచి 2404 మంది, వరంగల్ రూరల్ జిల్లా నుంచి 2327 మంది, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 1918 మంది, యాదాద్రి జిల్లా నుంచి 2361 మంది ఒంటరి మహిళలకు ఫించన్లు అందజేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

హైదరాబాద్‌లో ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తున్న
డిప్యూటీ సిఎం మహమూద్ అలీ