తెలంగాణ

‘బ్రాహ్మణ సదన్’ ఏడాదిలోగా నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ‘విప్రహిత బ్రాహ్మణ సదన్’ భవన నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి గచ్చిబౌలి సమీపంలోని గోపన్‌పల్లిలో 6.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన బ్రాహ్మణ సదన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. వాస్తవంగా ఈ శంకుస్థాపన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేయాల్సి ఉండగా, పంటినొప్పి కారణంగా సిఎం రాలేకపోవడంతో ఆయన తరఫున ప్రతినిధిగా కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ముఖ్యఅతిథిని కానని, అనుకోని అతిథిని అంటూ వివరించారు. ఈ భవన్‌ను ఏడాదిలోగా పూర్తి చేస్తామని, దీనికోసం 10 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. తన వంతుబాధ్యతగా భవన నిర్మాణాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, రోడ్లుభవనాల ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఇంజనీర్-ఇన్-చీఫ్ గణపతిరెడ్డిల నేతృత్వంలో భవన నిర్మాణం పూర్తవుతుందని వివరించారు.
మిషన్ కాకతీయ కార్యక్రమానికి ఏ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందో, అదే విధంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (టిబిఎస్‌పి) దేశంలోని ఈ తరహా ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలవాలని కెటిఆర్ సూచించారు. పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఈ సంస్థ పాటుపడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. బ్రాహ్మణులు అంటే కెసిఆర్‌కు వల్లమాలిన అభిమానం ఉందని, చిన్న తనంలో ఎక్కువగా బ్రాహ్మణుల ఇళ్లలోనే గడిపేవారని, దాంతో వారి సాధకబాధకాలు బాగా తెలుసని కెటిఆర్ వివరించారు. అందుకే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసి గత ఏడు 100 కోట్లు, ఈఏడు 100 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. 1980 లోనే సిద్ధిపేటలో బ్రాహ్మణ సేవా సంఘానికి భవనాన్ని నిర్మించారని గుర్తు చేశారు.
ధార్మిక కార్యక్రమాలకు కెసిఆర్ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. 2001 లో తెలంగాణ ఉద్యమ సమయంలో గోదావరి పుష్కరాలు రాగా, తెలంగాణలోని గోదావరి సమీపంలోని పుణ్యక్షేత్రాల్లో పుష్కరాలు పెద్దఎత్తున నిర్వహించాలని కెసిఆర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. దాంతో ఆనాటి నుండి గోదావరి, కృష్ణా పుష్కరాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయని వివరించారు.
రాష్టస్థ్రాయిలో విప్రహిత బ్రాహ్మణ సదన్ భవనాన్ని నిర్మిస్తున్నామని, జిల్లాల్లో కూడా ప్రత్యేక భవనాలు నిర్మిస్తామని టిఎస్‌బిపి చైర్మన్ కె.వి. రమణాచారి తెలిపారు. ఇప్పటికే గజ్వేల్‌లో బండారు రాంప్రసాద్ ఒక ఎకరాభూమిని, సూర్యాపేటలో మరొకరు ఒక ఎకరాభూమిని బ్రాహ్మణ భవనాల కోసం కేయించారని పేర్కొన్నారు. బ్రాహ్మణులంతా సంఘటిత శక్తిగా ఉండాలని పిలుపు ఇచ్చారు. ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఎపిలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత ఇద్దరు సిఎంలు చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడులకు దక్కిందని ఎపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల బ్రాహ్మణ సంక్షేమ సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, పరిషత్ ఉపాధ్యక్షుడు వనం జ్వాలా నర్సింహారావు, బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు, పరిషత్ సిఇఓ చంద్రమోహన్ తదితరులు మాట్లాడారు.