అంతర్జాతీయం

ఉగ్రవాదుల్ని వదిలిపెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 7: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద మహమ్మారిని సమష్టిగా ఎదుర్కోవాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు. గల్ప్ ప్రాంత శాంతి, సుస్థిరతకు పాటుపడాలని ఆయన అన్నారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్‌తో ట్రంప్ ఫోన్‌లో సం భాషించారు. ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు నిధులు అందజేస్తున్నారన్న కారణంతో ఖతార్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించకూడదని గల్ఫ్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాద గ్రూపు లు నిధులు అందజేతసహా పలు అం శాలపై ఇరుదేశాధినేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాదులను ఉపేక్షించకూడదని ఈ విషయంలో అత్యంత కఠినంగా ఉండాలని ట్రంప్ కోరారు. ప్రాంతీయ సుస్థిరతకోసం గల్ఫ్ దేశాలు కృషి చేయాలని అధ్యక్షుడు కోరినట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.