అంతర్జాతీయం

ఎఫ్‌బిఐ కొత్త డైరెక్టర్‌గా క్రిస్ట్ఫర్ రే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 7: ఎఫ్‌బిఐ కొత్త డైరెక్టర్‌గా మాజీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్ట్ఫర్ రేను నియమించాలని అనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చెప్పారు. ట్రంప్ అర్ధంతరంగా తొలగించిన ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ గురువారం సెనేట్ సెలెక్ట్ కమిటీ ముందు విచారణకు హాజరు కానున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. గత నెలలో కామీని తొలగించిన తర్వాత ఎఫ్‌బిఏ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉంటు న్న ఆండ్రూ మెక్ కేబ్ స్థానం లో క్రిస్ట్ఫర్ రే పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులవుతారు. 50 ఏళ్ల రే నియామకాన్ని సెనేట్ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా ఆయన గతంలో 2003, 2005 మధ్య కాలంలో న్యాయ శాఖ క్రిమినల్ విభాగం ఇన్‌చార్జిగా కూడా పని చేశారు.