కృష్ణ

ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ప్రమాదాల్లో మానవ తప్పిదం కారణం కారాదని, జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో పాఠశాలల బస్సు డ్రైవర్లు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని మొగల్రాజపురం పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం జిల్లా రవాణాశాఖ ఏర్పాటు చేసిన స్కూలు, బస్సు డ్రైవర్లకు పునఃశ్చరణ, అవగాహన ఒకరోజు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతా కమిటీ సమావేశాలు నిరంతరం నిర్వర్తిస్తూ ప్రమాదాల కారణాలపై విశే్లషించి అప్రమత్తం చేయడంతో గణనీయంగా తగ్గించగలిగామన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. యాక్సిడెంట్ డెత్ రివ్యూ కమిటీ ప్రమాదాలు జరిగిన తీరుపై చర్చిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మోటారు వెహికల్ చట్టం నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కలిగి ఉండాలన్నారు. డ్రైవర్లు విధిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు. ప్రతి పాఠశాల నుండి సంబంధిత బస్సులో ఉపాధ్యాయులు గాని, నోడల్ అధికారులు గాని ఉండాలన్నారు. బస్సు ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలన్నారు. జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దే మహా సంకల్పానికి చేయూత అందించాలని డ్రైవర్లను కలెక్టర్ కోరారు.
‘రక్ష’ ప్రజలకు శ్రీరామరక్ష కావాలి.. కలెక్టర్
నగరంలో తొలిసారిగా కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రులు, స్వచ్ఛంద సంస్థల సాకారంతో ‘రక్ష’ యాప్‌ను రూపొందించామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు చెందిన 11 వాహనాలను జోనల్ వారీగా సమీప ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు మ్యాపింగ్ నిర్వహించి అంబులెన్స్, బ్లడ్ బ్యాంక్, ట్రోమా కేర్ కేంద్రాలతో అనుసంధానిస్తామన్నారు. కొలాయిడ్స్ వంటి కృత్రిమ రక్తాన్ని అందుబాటులో ఉంచి ప్రమాదం జరిగిన నాలుగు నిమిషాల్లో ప్రాణాలు కాపాడేలా సరికొత్త, ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇ.మీరాప్రసాద్ మాట్లాడుతూ స్కూలు బస్సులు ప్రమాదాలకు గురికాకుండా 60 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేశామన్నారు. గుడివాడ, బందరు, నూజివీడు డివిజన్ స్థాయిలో కూడా బస్సు డ్రైవర్లకు అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ తరగతులకు హాజరైన డ్రైవర్లకు సర్ట్ఫికెట్స్‌ను అందిస్తామని, వాటిని డ్రైవర్లు చెకింగ్ సమయంలో రవాణాశాఖ అధికారులకు చూపవలసి ఉంటుందని డిటిసి తెలిపారు. అవగాహన కార్యక్రమంలో గుడివాడ, నందిగామ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్లు, ఎంవిఐలు, పాఠశాల బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.