కృష్ణ

27న అంతర్జాతీయ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రెన్యూర్స్ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: అంతర్జాతీయ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రెన్యూర్స్ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలెక్టరు పరిశ్రమలు, అనుబంధ రంగాల అధికారులతో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27న మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రెన్యూర్స్ కార్పొరేషన్ ప్రారంభిస్తారని తెలిపారు. పరిశ్రమలకు చెందిన అధికారులతో పాటు అనుబంధ రంగాలైన కార్మికశాఖ, ఫ్యాక్టరీలు, డిస్కమ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారన్నారు. సమావేశంలో కార్మిక శాఖ జోనల్ మేనేజర్ విశే్వశ్వరరావు, జనరల్ మేనేజర్ ఎ.సుధాకర్, కొండపల్లి, ఆటోనగర్, ఐలా చైర్మన్ కె.రామకృష్ణ, ఎస్.దుర్గాప్రసాద్, గుడివాడ ఆర్డీవో చక్రపాణి, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావ్ తదితరులు పాల్గొన్నారు.