క్రీడాభూమి

ఇదే నా చివరి సీజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్), జూన్ 26: తన కెరీర్‌లో ఇదే చివరి సీజన్ అని, ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత అథ్లెటిక్స్‌కు స్వస్తి పలుకుతానని స్ప్రింట్ వీరుడు ఉసేన్ బో ల్ట్ స్పష్టం చేశాడు. కెరీర్‌ను కొనసాగించే ఉద్దేశం లేదని, తన నిర్ణయంలో మార్పురాదని ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బోల్ట్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. ఇటీవలే అతను తన స్వస్థలమైన జమైకాలో చివరి రేసులో పాల్గొని విజయం సాధించాడు. హోం టౌన్ కింగ్‌స్టన్‌లో అతను చివరిసారి పోటీలోకి దిగి, 100 మీటర్ల లక్ష్యాన్ని 10.03 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అనంతరం, వేలాది మంది అభిమానుల సమక్షంలో విలేఖరులతో మాట్లాడుతూ, తాను రిటైర్మెంట్ గురించి బాధపడనని, వాస్తవానికి ఆ క్షణాలను, ఆతర్వాతి కాలాన్ని ఆస్వాదిస్తానని బోల్ట్ స్పష్టం చేశాడు. కెరీర్ ముగించిన తర్వాత కూడా ఇంతే ఆనందంగా ఉంటానని చెప్పాడు. ఈ ఏడాది ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత కెరీర్ నుంచి వైదొలగుతున్నట్టు బోల్ట్ ఇది వరకే ప్రకటించాడు. సొంత నగరంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో అతను రేసర్స్ గ్రాండ్ ప్రీలో చివరిసారి అతను పాల్గొన్నాడు. ఇప్పుడిక అతను 28న ఒస్ట్రావా, జూలై 21న మొనాకో రేస్‌లకు హాజరవుతాడు. ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో బరిలోకి దిగి, ఆ పోటీలు ముగిసిన వెంటనే కెరీర్‌కు గుడ్‌బై చెప్తాడు. ఈ విషయాలను అతను ప్రస్తావిస్తూ, ప్రతి రేసులోనూ ఉత్తమంగా రాణించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు పోటీదారుడిగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా హాజరవుతానని ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 100, 200 మీటర్ల స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న బోల్ట్ తెలిపాడు. అవసరం అనుకుంటే, అథ్లెట్లకు తాను సూచనలిస్తానని అన్నాడు. కాగా, బోల్ట్ రేస్‌ను ముగించిన వెంటనే, వేలాదిగా హాజరైన అభిమానులు అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. చప్పట్లో స్టేడియం మారుమోగింది. ఆ రేస్‌ను గురించి బోల్ట్ ప్రస్తావి స్తూ వేలాది మంది అభిమానుల సమక్షంలో, సొంత దేశం లో చివరి రేస్‌లో పాల్గొనడం ఎంతో ఉత్కంఠకు గురి చేసిందని చెప్పాడు.